పద్మావతికే బెదిరించారు, ఇక ద్రౌపతిగా చేస్తే చంపేస్తారేమో.!

కొన్ని పాత్రలు ఎందుకనో కొందరికి మాత్రమే సెట్ అవుతాయి అనిపిస్తుంటాయి. రాచరికంతోపాటు రౌద్రం కూడా ఉట్టిపడేలా నటించాలంటే ప్రస్తుతం ఉన్న నవతరం నటీమణుల్లో ఒక్క దీపిక పడుకోణేకే సాధ్యం. అందుకే సంజయ్ లీలా భన్సాలీ ఆమెను ఎరికోరి మరీ “బాజీరావ్ మస్తానీ, పద్మావతి” చిత్రాల్లో టైటిల్ పాత్రలు పోషింపజేశాడు. ఇక అప్పట్నుంచి ఆ తరహా పౌరాణిక పాత్రలంటే అందరికీ దీపిక గుర్తొస్తుంది. అందుకే.. తాజాగా బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మహాభారతం చిత్రంలోనూ ద్రౌపతిగా నటించేందుకు దీపికను సంప్రదించారట. నిజానికి ఆమెకు ఆ పాత్ర పోషించడానికి పెద్దగా ఇబ్బందేమీ లేకపోయినప్పటికీ నిరాకరించిందని వినికిడి.

అందుకు కారణం గత చిత్రం “పద్మావతి” చిత్రీకరణ, విడుదల సమయంలో చోటు చేసుకొన్న అల్లర్లు. అసలు చరిత్ర పుటల్లో సరైన ఇన్ఫర్మేషన్ కూడా లేని ఒక సినిమాలోని పాత్ర పోషించినందుకే తనను చంపేస్తామంటూ వేల మంది హడావుడి చేయడంతో బెదిరిపోయిన దీపిక పడుకొనే, ఇక భీభత్సమైన చరిత్ర, ప్రాధ్యాన్యత ఉన్న ద్రౌపతిగా నటిస్తే తెలిసో, తెలియాకో ఏదైనా తప్పు చేస్తే ఇంకా రచ్చ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నందున ఆ పాత్రను ఆమె రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే.. అమీర్ ఖాన్ మాత్రం ఆ పాత్రకు దీపిక మాత్రమే న్యాయం చేయగలదని భావిస్తున్నాడట. అందుకే ఆమెను ఎలాగైనా ఆ పాత్రలో నటింపజేయాలని దర్శకనిర్మాతలు కోరాడట. మరి అమీర్ అభీష్టాన్ని దీపిక ఏమాత్రం పట్టించుకొంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus