Deepika Padukone: కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

దీపిక పడుకొణె గురించి గత కొన్ని రోజులుగా తెగ వార్తలు చదువుతున్నాం. ఓ సినిమా నుండి తీసేశారని.. ఆమె పని తీరు, చెప్పిన రూల్స్‌ నచ్చకే ఆ సినిమా నుండి ఆమెను తొలగించారు అన్నారు. ఈ విషయంలో చర్చలు ఇంకా జరుగుతున్న సమయంలోనే మరో పెద్ద సినిమా నుండి ఆమె తప్పుకున్నారు (తీసేశారు) అనే అఫీషియల్‌ వార్త బయటకు వచ్చింది. ఈలోగా ఓ హాలీవుడ్‌ సినిమా కోసమే దీపిక ఇలా చేసింది అని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఓ స్టార్‌ డైరక్టర్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారనే వార్త బయటకు వచ్చింది.

Deepika Padukone

తాజాగా, ఈ విషయంలో దీపిక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రముఖ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరా ఖాన్‌, దీపికా ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకున్నారు అనేది లేటెస్ట్‌ వార్తల సారాంశం. అయితే దీనిపై ఫరా ఖాన్‌ ఇప్పటికే స్పందించారు. కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇద్దరి మధ్య ఏమైంది అంటూ ఓ మీడియా రాసిన కథనానికి రిప్లైగా ఆమె అలా మాట్లాడారు. ఇప్పుడు అదే మాటల్ని దీపిక కూడా చెప్పింది. సోషల్‌ మీడియాలో కాకుండా డైరెక్ట్‌గా మాట్లాడుకోవాలని తామిద్దరం నిర్ణయించుకున్నాం అనేది ఆ రిప్లై సారాంశం.

సోషల్‌ మీడియాలో ఒకరికొకరం పుట్టినరోజు శుభాకాంక్షల పోస్ట్‌లు కూడా పెట్టుకోమని దీపిక, ఫరా ఖాన్‌ వేర్వేరుగా తమ సోషల్‌ మీడియా పోస్టుల్లో రాసుకొచ్చారు. ఇలాంటివి దీపికకు నచ్చవని ఫరా ఖాన్‌ చెప్పగా.. ఫరా కామెంట్సే తాను కూడా చెప్పాలనుకున్నాను అని దీపిక రిప్లై ఇచ్చింది. అలాగే ‘తథాస్తు..’ అంటూ చేతులు జోడించిన ఎమోజీలు కూడా పెట్టింది. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడిందని చెప్పొచ్చు. అయితే ఇలాంటివి ఇష్టం లేనప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఫాలో అయ్యారు అనేది మరో ప్రశ్న. దీనికి మరోసారి ఎప్పుడైనా ఇద్దరూ రిప్లై ఇస్తారేమో చూడాలి.

మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus