Vishwambhara: విశ్వంభర.. కంటెంట్ లేకుంటే బిజినెస్ కష్టమే?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  నటిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ విశ్వంభర (Vishwambhara)  సినిమాపై ఇప్పుడు కొత్త చర్చలు మొదలయ్యాయి. వశిష్ఠ (Mallidi Vasishta)  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, గ్రాఫిక్స్ సీజీ వర్క్ కోసం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. హైదరాబాద్‌తో పాటు హాంకాంగ్ వంటివాటిలో సాంకేతిక పనులు కొనసాగుతున్నా, సినిమా రిలీజ్ డేట్‌పై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఎప్పటికీ వాయిదా పడుతుండటమే కాదు, బిజినెస్ పరంగా కూడా ఏదో లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

Vishwambhara

ఇప్పటికే ఈ సినిమా జూన్ లేదా జులైలో విడుదలయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనికన్నా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఇంకా ఈ సినిమాకి ఓటీటీ, శాటిలైట్ రైట్స్ పూర్తిగా ఫైనల్ కావడంలేదు. చిరంజీవి స్థాయి హీరో సినిమా అయినప్పటికీ, ఇప్పటికీ బిజినెస్ డీల్ జరగకపోవడం ఆశ్చర్యంగా మారింది. గతంలో చిరు సినిమాలు షూటింగ్ సమయంలోనే డీల్ క్లోజ్ అయిపోయేవి. మరి విశ్వంభర విషయంలో ఈ డిలే ఎందుకు జరుగుతోంది?

వీటికి ప్రధాన కారణం మేకింగ్‌ బజ్ లోపమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఒక స్పెషల్ క్రేజ్ రావాల్సింది. కానీ అది కనిపించలేదు. పోస్టర్, టీజర్, సాంగ్స్ లేదా ఏదైనా కనెక్ట్ అయ్యే కంటెంట్ విడుదల కాకపోవడం వల్ల మార్కెట్‌లో హైప్ రాలేదు. ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రమోషన్ జరగకపోవడంతో, బిజినెస్ డీల్స్ లో కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయని సమాచారం. OTT సంస్థలు, శాటిలైట్ ఛానల్స్ బజ్‌కు తగ్గట్టే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే స్ట్రాటజీతో ఉండడంతో, చిత్ర బృందానికి నడుమ ఒత్తిడి నెలకొంది.

ఇప్పుడు మేకర్స్ చేస్తున్న ప్రధాన పనితీరు టీజర్ ప్రోమో కంటెంట్ మీద ఫోకస్ పెట్టడమే. గ్రాఫిక్స్ వర్క్ పూర్తయిన వెంటనే టీజర్ విడుదల చేసి, సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే, బిజినెస్ క్లోజ్ అయ్యే పనులు కూడా ఆ తర్వాతే జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిరు లుక్, కథా బలంతో సినిమాపై హైప్ రాగలిగితే తప్ప, సంస్థలు డీల్‌కు ముందుకు రావటం కష్టమే అన్నది స్పష్టమవుతోంది.

ఒక్కసారి ప్రమోషన్ మొదలైతే, చిరంజీవి మాస్ ఇమేజ్‌తో పాటు వశిష్ఠ విజన్ కలిసొస్తే సినిమా మీద మళ్లీ పాజిటివ్ ట్రెండ్ మొదలవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. కానీ రిలీజ్ తేదీపై స్పష్టత లేకపోవడం, బిజినెస్ లేనిదిగా ఉండటం ఈ మెగా ప్రాజెక్ట్‌కు తలనొప్పిగా మారింది. ఇక విశ్వంభర వాయిదాలు ఎంతవరకు కొనసాగుతాయో, ప్రమోషన్లతో ఆ పరిస్థితి మారుతుందో చూడాలి.

రాబిన్ హుడ్ సక్సెస్ పై బోలెడు ఆశలు పెట్టుకున్న నితిన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus