ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిరు బంధం.. దుబాయిలో మరోసారి కనిపించిందిగా..!

Advertisement

ఐపీఎల్‌లో ఓ భాగం కావాలి అని మెగా ఫ్యామిలీ చాలా ఏళ్లుగా అనుకుంటోంది. ఈ విషయంలో ఎక్కడా వాళ్లు అఫీషియల్‌గా చెప్పనప్పటికీ.. ఓ టాక్‌ అయితే టాలీవుడ్‌లో నడుస్తోంది. రామ్‌ చరణ్‌ (Ram Charan) కూడా ఈ ఎంట్రీకి అనుకూలంగా మాట్లాడినట్లు గుర్తు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఓ టీమ్‌ కొనుగోలు చేస్తారని, అవసరమైతే మరొకరితో కలసి టీమ్‌ను దక్కించుకుంటారు అని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ విషయంలో మొన్నొక క్లారిటీ రాగా, ఇప్పుడు మరో క్లారిటీ వచ్చింది.

Chiranjeevi

ఐపీఎల్‌లో జట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదని ఐపీఎల్‌ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో చిరంజీవి (Chiranjeevi) ఓ ఐపీఎల్‌ జట్టుతో కలసి నడవబోతున్నారు అని ఈ మధ్య వార్తలొచ్చాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE)లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా షార్జాలో దుబాయ్ కేపిటల్స్, షార్జా వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి చిరంజీవి వచ్చారు. ఐసీసీ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ ఛైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధితో కలిసి చిరంజీవి మ్యాచ్‌ను తిలకించారు.

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఓ వాటా తీసుకునే ఆలోచనలో చిరంజీవి ఉన్నారని వార్తలొచ్చాయి. ఇప్పుడు మరోసారి డీసీ యాజమాన్యంతో కలసి మరోసారి దుబాయిలో కనిపించారు. దుబాయిలో ఇటీవల జరిగిన భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌కు చిరంజీవి వచ్చారు. దీంతో డీసీతో చిరంజీవి స్నేహం పక్కా అని చెబుతున్నారు. గతంలో చిరంజీవి ఇలా మైదానానికి వచ్చి మ్యాచ్‌ చూసిన దాఖలాలు లేవు. మన దేశంలో కూడా యన ఎప్పుడూ ఇలా మైదానానికి వచ్చి మ్యాచ్‌ చూడలేదు. విదేశాల్లో కూడా తక్కువే.

అలాంటిది వరుసగా రెండు మ్యాచ్‌లు ఇలా చూడటం ఆసక్తికర విషయమే. విశాఖపట్నాన్ని సెకండ్‌ హోమ్‌ గ్రౌండ్‌గా ఢిల్లీ టీమ్‌ పెట్టుకుంది. కాబట్టి ఇక్కడ మ్యాచ్‌ జరిగితే రామ్‌చరణ్‌ ప్రచారం చేసే అవకాశం ఉందని అనిపిస్తోంది. చూద్దాం వచ్చే నెల 22న ఐపీఎల్‌ స్టార్ట్‌ అవుతోంది. ఈ లోపు ఐపీఎల్‌ మెగా ఎంట్రీపై ఓ క్లారిటీ వస్తుంది.

సమంత చెప్పిన బెస్ట్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌… తెలుగులో ఒక్కరూ లేరు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus