సమంత (Samantha) తమిళనాడు నుండి తెలుగులోకి వచ్చినా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో స్టార్ అయినా, ఇప్పుడు బాలీవుడ్ వెళ్లి అదరగొడుతోంది. అయితే ఆమెకు ఇంత ఫేమ్, నేమ్ రావడానికి కారణం టాలీవుడ్ అని చెప్పొచ్చు. ఇక్కడే ఆమె స్టార్ హీరోయిన్ అయింది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న / తెరకెక్కిన సినిమాల్లో ఏవీ ఆమెకు నచ్చడం లేదా? ఏమో ఆమె రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిపిన ముచ్చట్లు చూస్తే అదే అర్థమవుతోంది.
సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె మొబైల్‌కి, సోషల్ మీడియాకు దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు మొబైల్ చేతికొచ్చింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న ఓ అభిమాని అడిగారు. దానికి సమంత చెప్పిన సమాధానంలో తెలుగు సినిమాలు, తెలుగు హీరోయిన్లు లేకపోవడం గమనార్హం.
సమంత చెప్పిన పేర్లు చూస్తే.. మలయాళ హీరోయిన్ పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu) (ఉల్లొళుక్కు (Ullozhukku)), సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) (అమరన్) (Amaran), మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా (Nazriya Nazim) (సూక్ష్మదర్శిని) (Sookshmadarshini), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) (జిగ్రా (Jigra), యువ బాలీవుడ్ కథానాయిక అనన్య పాండే (Ananya Panday) (CTRL), దివ్య ప్రభ (Divya Prabha) (ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (All We Imagine as Light) పేర్లు చెప్పింది. ఇందులో చూస్తే ఒక్క తెలుగు సినిమా కానీ, తెలుగు సినిమాలో నటించిన హీరోయిన్ కానీ లేకపోవడం గమనార్హం.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను గతేడాది ప్రకటించింది. అయితే ఆ తర్వాత టీమ్ నుండి అప్‌డేట్ ఇవ్వలేదు.