మొత్తానికి మహానుభావుడు అనిపించుకొన్నాడు!

సైలెంట్ గా ఫీల్డ్ లోకి వచ్చి సిక్స్ కొట్టడం శర్వానంద్ కి కొత్తేమీ కాదు. ఈ ఏడాది సంక్రాంతికి “ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి” లాంటి అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్నా ఏమాత్రం భయపడకుండా “శతమానమ్ భవతి” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టడమే కాక నేషనల్ అవార్డ్ ను సైతం సొంతం చేసుకొన్నాడు. అలాగే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఎన్టీయార్ “నాన్నకు ప్రేమతో”, బాలయ్య “డిక్టేటర్” లాంటి సినిమాలు విడుదలైనా “ఎక్స్ ప్రెస్ రాజా” అంటూ వచ్చి డీసెంట్ హిట్ కొట్టాడు.

తాజాగా అదే ఫార్మాట్ లో యంగ్ టైగర్ ఎన్టీయార్ “జై లవ కుశ”, సూపర్ స్టార్ “స్పైడర్’ సినిమాలు విడుదలైన తర్వాత “మహానుభావుడు”గా వచ్చి భలే హిట్ కొట్టాడు. “జై లవకుశ” కేవలం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా, “స్పైడర్” ఫ్లాప్ అయ్యింది. దాంతో కామెడీ కోషంట్ ఫుల్లుగా ఉన్న “మహానుభావుడు” సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించింది. ఇప్పటివరకూ శర్వానంద్ కెరీర్ లో హయ్యస్ట్ ఎమౌంట్ కలెక్ట్ చేసిన సినిమాగా మిగలడమే కాక.. ఈ దసరాకీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకి భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఏకైక చిత్రంగా “మహానుభావుడు” నిలిచింది. సో ఈ దసరా విన్నర్ మన శర్వానందేనన్నమాట. ఇదే స్పీడ్ లో శర్వా ముందుకుసాగితే.. అతీత్వరలో అగ్ర కథానాయకుల జాబితాలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus