సుడిగాలి సుధీర్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి గురించి ఆసక్తికరమైన విషయాలు..!

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై ఇతనికి స్టార్ ఫాలోయింగ్ ఉంది. ఓ మెజీషియన్ గా కెరీర్ ను మొదలుపెట్టి జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి, అటు తర్వాత టీమ్ లీడ్ అయ్యి .. ఇప్పుడు పలు కామెడీ షోలతోనూ, సినిమాలతోనూ బిజీగా గడుపుతున్నాడు. జబర్దస్త్ యాంకర్ రష్మి తో ఇతను డేటింగ్ లో ఉన్నట్టు ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ జంట కూడా అవును అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటుంది.

అయితే ఇటీవల ఇతను మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో ఇటీవల ఓ అమ్మాయితో సుధీర్ ఎంగేజ్మెంట్ జరిగినట్టు చూపించారు. అది షోలో భాగం మాత్రమేనా అనే అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. మరోపక్క అసలు సుధీర్ రింగ్ తొడిగిన ఆ అమ్మాయి ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం… సుధీర్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు చూపించిన అమ్మాయి పేరు తేజస్వి నాయుడు.

ఈమె ఆంధ్రాకి చెందిన అమ్మాయి. చదువు పూర్తయ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. సినిమా అవకాశాల కోసం చాలా ఆడిషన్లు కూడా ఇచ్చింది. కొన్ని యాడ్స్ లో కూడా నటించింది. అయినా ఆశించిన బ్రేక్ రాలేదు. అయితే సడెన్ గా సుధీర్ తో పెళ్ళి చేసుకుంటున్నట్టు కనిపిస్తూ వార్తల్లో నిలిచింది. అందుకే ఈమె గురించి సోషల్ మీడియాలో జల్లెడపడుతున్నారు మన నెటిజన్లు. ఆ ఎంగేజ్మెంట్ మేటర్ నిజమా కాదా అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus