బిగ్ బాస్ 4: రాణిగా రఫ్పాడించిన హారిక..!

బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ రేస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. మిగిలిన వాళ్లు అందరూ టాప్ – 5 కి వెళ్లినట్లే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కింగ్ ఆఫ్ ద హౌస్ అయ్యే ఛాన్స్ పార్టిసిపెంట్స్ కి ఇచ్చాడు. బజర్ మోగగానే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు సోహైల్. సోహైల్ కింగ్ గా చాలా ఫన్ చేశాడు. ముఖ్యంగా అరియానాతో పనులు చేయిస్తూ రెచ్చిపోయాడు. అరియానా రీ కౌంటర్ ఎటాక్ చేస్తూ సోహైల్ ని టీజ్ చేసి రెచ్చగొట్టింది. అరియానా వర్క్ చేస్తుంటే, హారిక కూడ కింగ్ సోహైల్ కి సాలిడ్ పంచ్ లు ఇచ్చింది. అంతేకాదు, అసలు నీదో రాజ్యం.. వీళ్లో ప్రజలా అంటూ రెచ్చగొట్టింది. ఆ తర్వాత సోహైల్ తన కిరీటాన్ని అభిజిత్ కి ఇచ్చాడు. అభిజిత్ కూల్ గా హ్యాండిల్ చేశాడు. తిరిగి హారికకి క్వీన్ గా కిరీటాన్ని ఇచ్చాడు.

ఇక్కడే అసలు కథ అనేది మొదలైంది. సోహైల్ ని పువ్వుతీసుకుని తనని పొగుడుతూ ప్రపోజ్ చేయమని చెప్పింది హారిక. ఇది చాలా ఈజీగా ఉంటుందని, ఏదైనా టఫ్ పనిష్మెంట్ లాంటిది ఇవ్వమని చెప్పాడు అఖిల్. దీంతో సోహైల్ కి కోపం వచ్చింది. చాలా ఫ్రస్టేట్ అయ్యాడు. హారిక ఏమైంది అని అడుగుతున్నా చెప్పలేదు. సీరియస్ గా షూస్ లేస్ కట్టుకుని డ్యాన్స్ చేశాడు. దీంతో హారిక ఇంక చాలు ఆపేయ్ అంటూ చెప్పింది. ఆతర్వాత సోహైల్ చాలా ప్రస్టేట్ అయ్యాడు. అఖిల్ నాకు సలహాలు ఇవ్వలేదు కానీ, హారికకి ఇస్తున్నాడు అంటూ ఫీల్ అయ్యాడు.

ఆ తర్వాత హారిక చాలా గొప్పపని చేసింది. అందర్నీ పిలిచి మరీ మీటింగ్ లాగా పెట్టి తన రాజ్యంలో ప్రజలకి శిక్షలు వేస్తే కఠినంగా ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకుంది. దీంతో సోహైల్ తన ఆవేదనని అంతా అక్కడ తీర్చేసుకున్నాడు. మొత్తానికి రాణిగా హారిక తనదైన స్టైల్లో రెచ్చిపోయిందనే చెప్పాలి. అదీ మేటర్.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus