Arjun Jandyala: బయట వాళ్ల బిడ్డను గొప్పగా పెంచి పెద్ద చేయడమే సవాలు: ‘దేవకీ..’ దర్శకుడు

  • November 18, 2024 / 02:53 PM IST

‘గుణ 369’ సినిమా తీసిన దర్శకుడేనా ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) తీసింది.. గత కొన్ని రోజులుగా ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే రెండు సినిమాల మధ్య చాలా తేడా ఉంది. ఆ కథకు, ఈ కథకు చాలా తేడా ఉంది. అశోక్‌ గల్లా  (Ashok Galla) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma కథ అందించారు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అర్జున్‌ జంధ్యాల (Arun Jandyala) మీడియాతో మాట్లాడారు.

Arjun Jandyala

‘హను – మాన్‌’ (Hanu Man) సినిమా కన్నా ముందే ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా సెట్‌ అయిందట. ఈ సినిమా నిర్మాతతో ప్రశాంత్‌ వర్మ ఓ సినిమా చేయాల్సి ఉందట. అలాగే అర్జున్‌ కూడా ఓ సినిమా చేయాలనుకున్నారట. దీని కోసం అశోక్‌ గల్లాకు ఓ కథ కూడా చెప్పారట. అయితే ప్రశాంత్‌ వర్మ వేరే సినిమాలతో బిజీ అవ్వడంతో.. ‘దేవకీ..’ కథను అర్జున్‌కి (Arjun Jandyala) ఇచ్చారట. కథకు కొన్ని మార్పులు సినిమా చేశారట.

‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా ట్రైలర్‌ చూసి ‘మురారి’తో (Murari) పోలుస్తున్నారు కానీ.. ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదట. ట్రైలర్‌లో చూపించినట్లు సుదర్శన చక్రంతో ఉన్న వాసుదేవుడి విగ్రహం ఎక్కడా లేదట. అయితే దానికీ ఈ కథకి ఇంట్రెస్టింగ్‌ కనెక్షన్‌ ఉంటుందట. అదేంటో సినిమాలోనే చూడాలి అని అర్జున్‌ జంధ్యాల (Arjun Jandyala) అంటున్నారు. సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యముందని చెప్పారాయన.

అయితే ఆ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సహజంగా ఉంటాయని, స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు ఏది గ్రాఫిక్స్, ఏది సెట్‌ అన్నది అంత తేలికగా గుర్తించలేరు అని అర్జున్‌ చెప్పారు. సొంత కథల్ని తెరకెక్కించడం కంటే బయటి కథలతో సినిమా చేయడంలో సవాలుతో కూడుకున్నది అని అర్జున్‌ అంటున్నారు. మన బిడ్డను మనం బాగానే పెంచి పెద్ద చేస్తాం. కానీ, బయట వాళ్ల బిడ్డను కూడా అంతే గొప్పగా పెంచి పెద్ద చేయడమే సవాలు అని ఆయన విశ్లేషించారు.

‘పుష్ప: ది రూల్‌’.. అంతమంది సంగీత దర్శకులు ఎందుకు.. ఏం చేస్తున్నారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus