మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ తనయుడు అయినటువంటి అశోక్ గల్లా (Ashok Galla) ‘హీరో’ చిత్రంతో డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాగానే ఉన్నప్పటికీ.. బడ్జెట్ పెరిగిపోవడం వల్ల అది కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. కానీ ఓటీటీల్లో ఆ సినిమాని బాగానే చూశారు. ఇక దాని తర్వాత రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) చేశాడు అశోక్ గల్లా. మైథలాజికల్ టచ్ తో కూడిన కమర్షియల్ మూవీ ఇది.
నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ అందించడంతో ప్రమోషన్స్ కి హెల్ప్ అయ్యింది. బోయపాటి శ్రీను (Boyapati Srinu) శిష్యుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల (Arun Jandyala) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అయితే మొదటి షోతోనే ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. 2017 లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘వాట్ హప్పెండ్ టు మండే’ ని కాపీ కొట్టేసి దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘దేవకీ నందన వాసుదేవ’ కథ చేసాడని చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు.
దాదాపు రూ.26 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తీశారు నిర్మాత. అందులో సగం బడ్జెట్ అశోక్ గల్లా ఫ్యామిలీ పెట్టుకున్నట్టు కూడా టాక్. ఇక సినిమాకి నెగిటివ్ టాక్ రావడం వల్ల థియేటర్లలో నిలబడలేదు. దీంతో ఈ సినిమాకి ఓటీటీ బిజినెస్ కూడా కాలేదు. అయితే మొత్తానికి వ్యూయర్షిప్ పద్ధతిలో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. ఫిబ్రవరి 8 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక్కడైనా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందేమో చూడాలి.