సినిమాల బడ్జెట్ స్క్రీన్ పై కనిపించేది మాత్రమే కాదు… తెరవెనుక అంటే మేకింగ్ ప్రాసెస్లో చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. హీరోకి ఇచ్చే పారితోషికంతో పాటు అతని టీంకి కూడా నిర్మాత డైలీ ఖర్చులు చెల్లించాలి. అందులో మేకప్ టీం కూడా ఉంటుంది. ఒకవేళ సినిమాలో హీరో.. రెండు, మూడు గెటప్పులు వేయాల్సి వస్తే.. నిర్మాతలు ప్రత్యేకంగా మేకప్ మెన్లని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి ఎగ్జామ్పుల్స్ చాలా ఉన్నాయి.
కానీ అందులో ఒకటైన ‘లైలా’ (Laila) సినిమా గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ‘లైలా’ లో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరో. ఈ సినిమాలో అతను వేసిన లేడీ గెటప్ హైలెట్ అవుతుంది అని మొదటి నుండి చిత్ర బృందం చెబుతూ వస్తోంది. ఈ గెటప్ వేయడం ఇష్టం లేక ఈ స్క్రిప్ట్ ను ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసినట్టు కూడా నిర్మాత ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా లేడీ గెటప్ హైలెట్ అయ్యింది.
సినిమాలో హీరో ఆ గెటప్ ఎందుకు వేయాల్సి వస్తుంది అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. దాని చుట్టూనే కామెడీ రన్ అవుతుంది. అందుకే హీరో విశ్వక్ సేన్ కూడా ఈ పాత్ర చేయడానికి ధైర్యం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ 10 రోజుల వరకు లేడీ గెటప్ వేయాల్సి వచ్చిందట.
ఒక్కరోజుకి గాను లక్షన్నర ఖర్చు అయ్యిందట. ఇది కేవలం మేకప్ కోసం అని అంటున్నారు. అలాగే విశ్వక్ సేన్ కట్టుకున్న చీర వంటివి కూడా బాగా కాస్ట్లీ అట. మొత్తంగా ఈ గెటప్ కోసం రూ.25 లక్షలకు పైగానే ఖర్చు అయ్యింది అని స్పష్టమవుతుంది.