జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా రిలీజ్ కు సరిగ్గా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఆడియో రైట్స్ కు సంబంధించి కూడా కీలక ప్రకటన వెలువడింది.
ప్రముఖ సంస్థలలో ఒకటైన టీ సిరీస్ ఈ సినిమా ఆడియో హక్కులను కొనుగోలు చేసినట్టు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరతో కొలాబరేట్ కావడం మాకు గర్వంగా ఉందని టీ సిరీస్ వెల్లడించింది. దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఒకింత భారీ మొత్తానికి టీ సిరీస్ దేవర ఆడియో రైట్స్ ను కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
దేవర సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా సగం కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ రికవరీ అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం ఒకింత స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. కొరటాల శివ మూడేళ్ల కష్టానికి దేవర సినిమా రూపంలో ప్రతిఫలం దక్కనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి ఆ డైరెక్టర్లకు హిట్లు దక్కేలా చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ విషయంలో సైతం అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాజమౌళి సెంటిమెంట్ ను కచ్చితంగా దేవర బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన దేవర మూవీ గ్లింప్స్ రిలీజ్ కానుండగా గ్లింప్స్ తో దేవర సంచలనాలు మొదలుకానున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ సైతం ఈ సినిమాతో తన జాతకం మారిపోతుందని బలంగా నమ్ముతున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!