Devara: దేవర సినిమా వల్ల ఆ ఇద్దరి జాతకాలు మారిపోవడం ఖాయమా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)   కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర (Devara) సినిమాకు ఒకింత మిక్స్డ్ టాక్ వస్తున్నా దేవర కలెక్షన్ల విషయంలొ అదరగొట్టడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా సైఫ్ అలీ ఖాన్  (Saif Ali Khan), అనిరుధ్ కు (Anirudh Ravichander) ఎంతో ప్లస్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆదిపురుష్ (Adipurush) సినిమా రిలీజ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే దేవర సినిమాలో భైరా పాత్రకు సైఫ్ అలీ ఖాన్ తన నటనతో ప్రాణం పోశారు.

Devara

పవర్ ఫుల్ విలనిజంతో సైఫ్ అలీ ఖాన్ ప్రేక్షకులను మెప్పించారు. దేవర సినిమాలో అనిరుధ్ మ్యూజిక్, బీజీఎంకు మంచి మార్కులు పడ్డాయి. ఎలివేషన్ సీన్స్ లో అనిరుధ్ అద్భుతం చేశారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు. అనిరుధ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని సినిమా ఆఫర్లు రావడం పక్కా అని చెప్పవచ్చు.

మాస్ సినిమాలకు సైతం అనిరుధ్ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాను చూస్తే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపిస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ కపూర్ కు మాత్రం మరీ గొప్ప పాత్ర అయితే దక్కలేదని చెప్పవచ్చు. దేవర సినిమాలో కొన్ని ఆసక్తికర ట్విస్టులు సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

దేవర సినిమా సులువుగానే లాభాలను సొంతం చేసుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర సినిమా మండే కలెక్షన్ల ఆధారంగా ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. దేవర మూవీ క్రిటిక్స్ లో చాలామందిని సైతం మెప్పించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

మళ్ళీ అదే తప్పు.. స్టార్ హీరోల సినిమాల విషయంలో నిర్మాతలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus