Devara: మళ్ళీ అదే తప్పు.. స్టార్ హీరోల సినిమాల విషయంలో నిర్మాతలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.!

  • September 27, 2024 / 07:38 PM IST

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ (Jr NTR)  నుండి వచ్చిన చిత్రం ‘దేవర’ (Devara) . కొరటాల శివ (Koratala Siva)  దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) , మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుండీ వచ్చిన సినిమా. దీంతో మొదటి నుండి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. రిలీజ్ ట్రైలర్ కూడా అంచనాలు పెంచడంతో.. ‘దేవర’ కి హైప్ బాగా పెరిగింది.

Devara

అయితే మొదటి రోజు ‘దేవర’ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుంది అంటున్నారు. ఇంకొంతమంది పెద్దగా లేదు అంటున్నారు. టాక్ ఇలా రావడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉంది. అదేంటి అంటే.. అర్ధరాత్రి 1 గంట షోలు వేయడం. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరోపక్క దర్శకుడు కొరటాల శివ తీసే సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ తో పాటు డ్రామాలో డీటెయిలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది.

అర్ధరాత్రి షోలు చూసే వాళ్లలో మెజారిటీ ఆడియన్స్.. ఫ్యాన్సే ఉంటారు. వాళ్లకి కథ, ఎమోషన్స్ ..అనేవి ఆ టైంకి అనవసరం. ఫైట్స్, ఎలివేషన్స్ కోసం మాత్రమే వాళ్ళు ఆ టైంలో వెతుక్కుంటూ ఉంటారు. ‘దేవర’ లాంటి కథలోని సెన్సిబిలిటీస్ అర్థం చేసుకోవాలి అంటే..నైట్ అంతా నిద్రపోయి.. ఉదయాన్నే ప్రశాంతంగా వచ్చి మార్నింగ్ షోలు చూడాలి. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) విషయంలో కూడా ఇదే జరిగింది.

మాస్ సినిమా అని దాన్ని మొదటి నుండి ప్రమోట్ చేశారు. కానీ సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉంది. అందువల్ల ఆ సినిమాకి పేర్లు పెట్టారు. ‘దేవర’ విషయంలో కూడా అలాంటి తప్పే జరిగింది. డౌట్ లేకుండా ఒకసారి చూసే విధంగా ‘దేవర’ ఉంది. కానీ మిడ్ నైట్ షోల వల్ల.. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంతంగా మార్నింగ్ షోలు కనుక వేసుంటే.. బెటర్ టాక్ వచ్చుండేది.

‘దేవర’ టీం.. పెద్ద ప్లానే… కానీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus