Devara: టికెట్ల ప్రీ సేల్ లో నయా రికార్డ్.. దేవర రికార్డులు వేరే లెవెల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర  (Devara)    సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టకుండానే ఈ సినిమా సంచలన రికార్డులను సొంతం చేసుకుంటోంది. ట్రైలర్ రిలీజ్ కాకుండానే సోషల్ మీడియాలో దేవర సంచలనాలు మొదలయ్యాయి. ఓవర్సీస్ ప్రీ సేల్ టికెట్స్ బుకింగ్ లో వన్ మిలియన్ మార్క్ ను వేగంగా అందుకున్న సినిమాగా దేవర మూవీ నిలవడం గమనార్హం. సోషల్ మీడియాలో ప్రస్తుతం దేవర పేరు ట్రెండింగ్ లో ఉండగా నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ వద్ద ప్రీ సేల్ ద్వారా వేగంగా ట్రైలర్ రిలీజ్ కు ముందే వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకుని ఫస్ట్ ఇండియన్ మూవీగా దేవర రికార్డులకెక్కింది.

Devara

గతంలో ఏ ఇండియన్ సినిమాకు సొంతం కాని రికార్డును సొంతం చేసుకుని దేవర (Devara) రిలీజ్ కు ముందే వార్తల్లో నిలుస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ లెక్కలు మారిపోవడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదలవుతున్న కొత్త పొస్టర్లు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఐదు భాషల్లో దేవర మూవీ థియేటర్లలో విడుదల కానుండగా దేవర బ్లాక్ బస్టర్ హిట్ అని రిలీజ్ కు ముందే ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

దేవర (Devara) ట్రైలర్ అన్ని భాషల్లో ఒకే సమయానికి విడుదల కానుంది. ట్రైలర్ విడుదలైన తర్వాత యూట్యూబ్ లో వ్యూస్ పరంగా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ యూట్యూబ్ అకౌంట్ లో దేవర తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల కానుంది.

కన్నడ వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ కానుండగా మలయాళం వెర్షన్ మాత్రం యువసుధ ఆర్ట్స్ అఫీషియల్ ఛానల్ లో రిలీజ్ కానుంది. హిందీ, తమిళ్ వెర్షన్ ట్రైలర్లు మాత్రం టీ సిరీస్, టీ సిరీస్ తమిళ్ యూట్యూబ్ ఛానల్స్ లో విడుదల కానున్నాయి.

దేవర’ బ్రతికున్నాడా? చనిపోయాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus