Devara: దేవరకు హైలెట్ కానున్న జాతర ఎపిసోడ్.. అలా ఉండబోతుందా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ రిలీజ్ కు మరో 100 రోజుల సమయం మాత్రమే ఉంది. జనవరి నెల 8వ తేదీన ఈ సినిమా నుంచి గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సంక్రాంతి సినిమాలు ప్రదర్శించే థియేటర్లలో సైతం ఈ గ్లింప్స్ ను ప్రదర్శిస్తారని సమాచారం అందుతోంది. దేవర సినిమాకు జాతర ఎపిసోడ్ హైలెట్ కానుందని ఈ ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.

ఈ ఎపిసోడ్ లో గంగమ్మ తల్లి భక్తుడిగా తారక్ కనిపిస్తారని పూనకాలు వచ్చేలా ఆ సీన్ ఉంటుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి జపాన్ లో ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను జరుపుకుని తారక్ ఇండియాకు రానున్నారు. డెవిల్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో సైతం తారక్ పాల్గొనే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి,

ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ లు కూడా ఉంటాయని ఆ షాట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దేవర సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమాలో మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే సీన్స్ ఎక్కువగానే ఉండనున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో (Devara) తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తుండగా భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రెండు లుక్స్ లో కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కొరటాల శివ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించి కెరీర్ పరంగా బిజీ కావాలని ఫీలవుతున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus