Devara: జూనియర్ ఎన్టీఆర్ దేవర ఓవర్సీస్ టార్గెట్ లెక్క తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో దేవర సినిమా కూడా ఒకటి. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం దేవర సినిమా దగ్గర మా టైమ్, మైండ్ నిలిచిపోయి ఉన్నాయని ఈ సినిమా విషయంలో మాపై ప్రెజర్ కూడా ఉందని కామెంట్లు చేశారు. దేవర సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దేవర సినిమా ఓవర్సీస్ హక్కులను 30 కోట్ల రూపాయల రేంజ్ లో విక్రయించాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొదలైందని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా గ్లింప్స్ విడుదలైతే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, షైన్, టామ్ చాకో, శ్రీకాంత్ మరి కొందరు ప్రముఖ నటులు నటిస్తున్నారు. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం వేరే లెవెల్ లో ఉన్నాయని భోగట్టా.

కొరటాల శివ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర సినిమా బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడటం లేదు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమా మిగతా షూటింగ్ మొదలుకానుంది. దేవర సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండగా ఇతర భాషల్లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ వేరే లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. దేవర సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర (Devara) సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus