Devara: 100 రోజుల్లో రిలీజ్ కానున్న తారక్ మూవీ.. సంచలనాలు గ్యారంటీ అంటూ?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ ఇప్పటికే 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుండగా ఆ టీజర్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ టీజర్ లో విజువల్ ఎఫెక్స్ట్ సైతం వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరో 100 రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది.

దేవర సినిమా ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి. వరుసగా సెలవులు ఉన్న సమయంలో దేవర సినిమాను రిలీజ్ చేస్తుండటంతో టాక్ బాగుంటే దేవర సృష్టించే సంచలనాలు అయితే మామూలుగా ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండటం గమనార్హం. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ ను మించి దేవర2 మూవీ తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

దేవర (Devara) సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ తర్వాత సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా సైఫ్ రేంజ్ ను మరింత పెంచుతుందేమో చూడాలి. దేవర సినిమాలో యాక్షన్ సీన్లు సైతం వేరే లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు టాప్ టెక్నీషియన్లు కావడంతో ఈ సినిమా ఇతర భాషల్లో సైతం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర సినిమాలో కళ్యాణ్ రామ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దేవర సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఎన్టీఆర్ నమ్ముతున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus