Devara New Trailer: ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా దేవర రిలీజ్ ట్రైలర్.. డైలాగ్స్ అదుర్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర (Devara) మూవీ రిలీజ్ కు మరో 120 గంటల సమయం మాత్రమే ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ విమర్శలకు చెక్ పెట్టేలా అదిరిపోయే షాట్స్ తో దేవర రిలీజ్ ట్రైలర్ ఉండటం గమనార్హం. 127 సెకన్లతో ఉన్న ఈ ట్రైలర్ లో ఫ్యాన్స్ కు నచ్చే షాట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.

Devara New Trailer

“నిన్న రేత్రో పీడకల వచ్చుండాది జోగులా.. సంద్రం మళ్లీ నిజంగా ఎరుపెక్కి ఎర్ర సముద్రం అయినట్టు.. అది నా నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాది” “భయం పోవాలంటే దేవుడి కథ వినాలా భయమంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా” “ముందుండేది మంచి రోజులు కాదు దేవర.. మన అనుకునే వాళ్లెవరూ మనోళ్లు కాదు” “సముద్రం ఎక్కాలా సముద్రం ఏలాలా” డైలాగ్స్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి.

ట్రైలర్ లో ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ కనిపించిన షాట్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంది. అదే సమయంలో అదిరిపోయే యాక్షన్ షాట్స్ తో ట్రైలర్ కట్ చేశారు. దేవర (Devara) రిలీజ్ ట్రైలర్ లో చివరి షాట్ వేరే లెవెల్ లో ఉంది. ట్రైలర్ ను మళ్లీమళ్లీ చూడాలని అనిపిస్తోందని యంగ్ టైగర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రిలీజ్ ట్రైలర్ తో దేవర మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి.

రాజమౌళి సెంటిమెంట్ ను తారక్ బ్రేక్ చేయడం పక్కా అనిపించేలా ట్రైలర్ ఉంది. వర పాత్రకు సైతం ట్రైలర్ లో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు యాక్షన్ షాట్స్ ఉండటం గమనార్హం. దేవర పాత్ర ప్రధానంగా దేవర1 తెరకెక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయి. తారక్ ఖాతాలో దేవరతో మరో బ్లాక్ బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

బాహుబలి2 ప్రీసేల్ రికార్డ్ ను బ్రేక్ చేయడం తారక్ మూవీకి సాధ్యమా?

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus