Anirudh Ravichander: దేవరతో లెక్కలు మారిపోయాయిగా.. అనిరుధ్ చేతిలో ఇన్ని ఆఫర్లా?

టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ (Anirudh Ravichander) కూడా ఒకరు కావడం గమనార్హం. దేవర (Devara) సినిమా సక్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిరుధ్ ఇమేజ్ ను మార్చేసింది. నాని  (Nani)  శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారని సమాచారం అందుతోంది. అనిరుధ్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే ఉన్నా నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు.

Anirudh Ravichander

టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయనున్నారని సమాచారం అందుతోంది. అనిరుధ్ నో చెబితే మాత్రమే దర్శకనిర్మాతలు ఇతర మ్యూజిక్ డైరెక్టర్లను సంప్రదిస్తున్నారని సమాచారం. అనిరుధ్ తన మ్యూజిక్, సాంగ్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు. అనిరుధ్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఎదిగి మరిన్ని విజయాలను అందుకోవడంతో పాటు సక్సెస్ రేట్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అనిరుధ్ చిన్న వయస్సులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అనిరుధ్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. అనిరుధ్ కెరీర్ ను సరైన విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారు. వేట్టయన్ (Vettaiyan) సినిమాకు అనిరుధ్ సినిమాకు మ్యూజిక్, బీజీఎం ప్లస్ అయ్యాయి. అనిరుధ్ స్క్రిప్ట్ నచ్చితే మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అనిరుధ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఉండటం అతని కెరీర్ కు ప్లస్ అవుతోంది. అనిరుధ్ పరిమితంగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ ఆ సినిమాల రేంజ్ ను పెంచడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నారు. అనిరుధ్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

ఆ సినీ కాంప్లెక్స్ లో రజనీకి మాత్రమే సాధ్యమైన అరుదైన ఘనత ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus