Rajinikanth: ఆ సినీ కాంప్లెక్స్ లో రజనీకి మాత్రమే సాధ్యమైన అరుదైన ఘనత ఇదే!

సూపర్ స్టార్ రజనీకాంత్ కు  (Rajinikanth) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రజనీకాంత్ సినిమాలకు ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేట్టయన్ (Vettaiyan)  సినిమాతో రజనీకాంత్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తమిళంలో ఈ సినిమాకు భారీ స్థాయిలోనే కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు పరిమితంగా కలెక్షన్లు వస్తుండటం కొసమెరుపు. అయితే రజనీకాంత్ ఖాతాలో ఉన్న ఒక అరుదైన ఘనత ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

Rajinikanth

తమిళనాడులోని ప్రముఖ సినీ కాంప్లెక్స్ లలో ఉదయం సినిమాస్ ఒకటి కాగా ఈ సినిమాలో మొదట ప్రదర్శించబడిన చిత్రం రజనీకాంత్ శివప్పు సూరియన్ అయితే చివరిగా ప్రదర్శించబడిన సినిమా వేట్టయన్ కావడం గమనార్హం. దాదాపుగా 41 సంవత్సరాల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కాంప్లెక్స్ లో సినిమాలు ప్రదర్శితమయ్యాయి. అయితే ఈ కాంప్లెక్స్ ను త్వరలో కూల్చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ కాంప్లెక్స్ ను త్వరలో కూల్చివేయనున్న నేపథ్యంలో ఈ కాంప్లెక్స్ తో అనుబంధం ఉన్నవాళ్లు ఫీలవుతున్నారు. రజనీకాంత్ వేట్టయన్ సినిమా ఈరోజు కూడా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. జైలర్ తో (Jailer) కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రజనీకాంత్ ఈ సినిమాతో అదే స్థాయి మ్యాజిక్ ను మాత్రం రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయస్సులో సైతం అదిరిపోయే యాక్షన్ సీన్స్ లో నటిస్తూ తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారనే చెప్పాలి. రజనీకాంత్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో సైతం నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. రజనీకాంత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

నాగ్ పరువు మొత్తం పోగొట్టుకున్నాడు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus