Devara: తండ్రీ కొడుకుల యుద్ధమే దేవర.. ఆ లిరిక్స్ అర్థం ఏంటంటే?

దేవర మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను మించి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దేవర గ్లింప్స్ లో అనిరుధ్ ఇంగ్లీష్ బిట్ ఉంటుందని ప్రచారం జరగగా ఆ ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. అయిదు భాషల్లో గ్లింప్స్ విడుదల కాగా ఈ గ్లింప్స్ వేరే లెవెల్ లో ఉంది. ఛత్రపతి సినిమాలో “తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని ఎరుపెక్కుతాయ్” అనే లైన్ కు దేవర్ పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రత్నవేలు సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అదుర్స్ అనేలా ఉంది. అయితే దేవర గ్లింప్స్ లో ఉన్న ఇంగ్లీష్ లిరిక్స్ తో కథ చెప్పేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తండ్రీ కొడుకుల మధ్య యుద్ధమే దేవర అని ప్రచారం జరుగుతోంది. “నువ్వు ఎప్పుడూ సముద్రాన్ని తాకలేదు.. నువ్వు ఎప్పుడూ నాతో ఆడుకోలేదు.. నేను ఎప్పుడూ నీపై దయ చూపించను.. నిన్ను నేను బ్రతకనివ్వను.. నీ రక్తాన్ని ఏరులై పారిస్తాను” అని ఆ ఇంగ్లీష్ సాంగ్ కు అర్థం.

అయితే తండ్రి గురించి ప్రస్తావిస్తూ ఆ సాంగ్ బిట్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర టీజర్, ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా కథ గురించి మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. దేవర సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేవర (Devara) సినిమా గ్లింప్స్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు వేరే లెవెల్ లో ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus