Devara: దేవర మూవీతో వాళ్లిద్దరూ ఆ రేంజ్ లో సక్సెస్ అవుతారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ తంగం పాత్రలో కనిపించనుండగా సైఫ్ అలీ ఖాన్ భైరా పాత్రలో కనిపించనున్నారు. వీళ్లిద్దరి కెరీర్ కు ఈ సినిమా కీలం కానుంది. దేవర సినిమాతో వాళ్లిద్దరూ స్టార్ స్టేటస్ సాధించడం సాధ్యమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేవర మూవీతో వాళ్లిద్దరూ ఊహించని రేంజ్ లో సక్సెస్ అవుతారని మరి కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దేవర మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. దేవర, దేవర2 ఇనిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ దేవర సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

దేవర (Devara) సినిమా కోసం కొరటాల శివ ఎంతగానో కష్టపడుతుండగా కొరటాల శివ గత సినిమాలను మించిన హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ ప్రస్తుతం టాకీ పార్ట్ ను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. కొరటాల శివ నమ్మకాన్ని దేవర నిజం చేస్తుందేమో చూడాల్సి ఉంది. దేవర సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్, కొరటాల శివ రెమ్యునరేషన్ల కోసమే 150 కోట్ల రూపాయల రేంజ్ లోనే ఖర్చు అవుతోందని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కమర్షియల్ అంశాలు ఉంటూనే కొత్తగా ఉండే కథాంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. తారక్ కొత్త లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus