కాలేజీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలోఅన్నదమ్ముల మధ్య జరుగుతున్నటువంటి కథ నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… రిషి తల్లి ప్రేమ కోసం ఆరాటపడుతున్నారని మహేంద్ర చెప్పడంతో ఎన్నాళ్ళని ఇలా మనం తనకు దూరంగా ఉంటం ఈ నిజం రిషికి చెప్పాలని జగతి మహేంద్రా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.మనం చెప్పిన రిషి నమ్ముతాడా ఇప్పటికీ తనకు తన పెద్దమ్మ అన్నయ్య పై చాలా నమ్మకం ఉందని మహేంద్ర చెప్పడంతో జగతి మాత్రం నమ్ముతాడ ఎన్ని రోజులని మనం రిషికి దూరంగా ఉండాలి మహేంద్ర అని ఏడుస్తూ ఉంటుంది. ఇలా జగతి మహేంద్ర మాట్లాడుకోవడం చూసినటువంటి దేవయాని అక్కడికి వచ్చి ఏం జరిగింది? ఇలా ఏడుస్తున్నావు రిషి ఎక్కడున్నారో తెలిసిందా అంటూ ఇంట్లో అందరిని పిలుస్తుంది.
ఇలా శైలేంద్ర ఫణింద్ర రావడంతో జగతి తన భర్త ముందు డ్రామా ప్లే చేస్తూ తనకేమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది జగతి వాళ్లకు రిషి ఎక్కడున్నారో తెలిసినట్టు ఉందనీ. చెబుతుంది దాంతో ఫణీంద్ర ఏం జరిగింది అని అడగడంతో మహేంద్ర ఏం లేదు అన్నయ్య రిషి ఎక్కడ ఉన్నాడో తెలిస్తే మేమెందుకు ఇలా ఉంటామని మహేంద్ర చెబుతాడు. అయినా మేమంతా ఉన్నాం కదా రిషికి ఏం కాదు తప్పకుండా తిరిగి వస్తాడని దేవయాని మాట్లాడటంతో కోపంగా జగతి దేవయాని వైపు చూస్తూ రిషి ఎక్కడున్నా మా బిడ్డపై మా ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా రిషి తిరిగి వస్తాడు అంటూ మాట్లాడుతుంది. జగతి అలా మాట్లాడటంతో దేవయాని టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి స్టూడెంట్స్ కి వివరిస్తూ ఉంటాడు రిషి. ఈ ప్రాజెక్టు గురించి ఇంత క్లారిటీగా ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు అంటే మీరు ఇంతకుముందు ఈ ప్రాజెక్టులో ఎక్కడైనా పని చేశారా అంటూ పాండియన్ రిషి సార్ ని అడగడంతో అవునని చెబుతాడు. ఇక మీకు ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే వసుధార మేడంను అడగండి తను కూడా చాలా ఎక్స్పీరియన్స్ అని రిషి చెప్పి బయటకు వెళ్తాడు. అయితే రిషి ఇలా క్లాసెస్ తీసుకోవడం చూసిన వసుధార గట్టిగా పిలుస్తూ వెళుతుంది అయినా రిషి వినిపించుకోడు.
ఇక రిషి ఇంటికి వెళ్లడంతో వసుధార కూడా కోపంగా విశ్వనాథం ఇంటికి వెళ్తుంది. సరాసరి రిషి గదిలోకి వెళ్లి తనపై తీవ్ర స్థాయిలో కోపం తెచ్చుకుంటుంది. మీపై అటాక్ జరిగిన మీరెందుకు ఒంటరిగా వెళ్తున్నారు. అయినా మీరు చెప్పాల్సింది మిషన్ ఎడ్యుకేషన్ గురించి కాదు మీపై ఎవరు అటాక్ చేయించారనే విషయం గురించి ఆలోచించండి అంటూ వసుధార గట్టిగా అరవడంతో ఏంజెల్ విశ్వనాథం కూడా అక్కడికి వస్తారు.ఏం జరిగిందమ్మ అంటూ విశ్వనాథం చెప్పడంతో తనమీద అటాక్ జరిగిన రిషి సార్ ఇలా ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారు. తన జాగ్రత్తలలో తాను ఉండాలి కదా సర్ మీరైనా చెప్పండి అంటూ విశ్వనాథ కి చెప్పడంతో నువ్వు ఇలా చెప్పడంతో నేను కూడా అలర్ట్ అవుతాను ఇకపై ఒంటరిగా ఎక్కడికి పంపించనని విశ్వనాథం చెబుతారు.
మీరు నాపై తీసుకుంటున్నటువంటి ఈ జాగ్రత్తలకు థాంక్స్ మేడం అంటూ వెటకారంగా రిషి మాట్లాడతారు.రిషికి ఇలా వార్నింగ్ ఇచ్చి వసుధార ఆటోలో వెళుతుండగా రిషి మరీ కార్లో వెళ్లి తనకు అడ్డుపడి అయినా నువ్వేంటి అందరి ముందు నాకు అలా వార్నింగ్ ఇచ్చావు.నువ్వు ఇలా అందరి ముందు మాట్లాడుతూ మన గతాన్ని బయటకు తవ్వాలని చూస్తున్నావా అంటూ మాట్లాడుతారు. కన్నతల్లి నన్ను మోసం చేసినప్పుడు ఎవరు నాపై అటాక్ చేస్తే నాకేంటి నేను వాళ్ళ గురించి ఆలోచించనని రిషి మాట్లాడతారు అయినా నా గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అని రిషి వసుధారను నిలదీయడంతో మరి నాకు ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎందుకు నా గురించి ఆలోచించారు అంటూ రిషికి పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది దీంతో పొగరు ఎక్కడ తగ్గదుగా అంటూ మనసులో అనుకుంటారు.