Devi Sri Prasad: కుర్రకారుతో ఊరమాస్‌ స్టెప్పులేయించిన పాట బ్యాగ్రౌండ్‌ స్టోరీ ఇదీ!

‘ఊ అంటావా మావా… ఊఊ అంటావా మామా…’ అని అన్నా, ‘ఊ బోలేగా ఊఊ బోలేగా’ అని అన్నా… అంటే ఏ భాషలో అన్నా కుర్రకారు మొత్తం ఊగిపోయారు. ‘పుష్ప’ సినిమాలోని ఈ పాటకు ఫ్యాన్స్‌ సందడి ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అలాంటి ఈ పాట గురించి సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ పాట ట్యూన్‌ ఎలా పుట్టింది, దాని కోసం ఏం జరిగింది అనే వివరాలు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్నే కాదు, మొత్తం దేశాన్ని ఓ ఊపు ఊపేసిన ‘ఊ అంటావా’ పాట ట్యూన్‌ రిజక్ట్‌ చేస్తారేమో అనుకుంటూ చేశారట దేవిశ్రీప్రసాద్‌. ట్యూన్‌ విన్నాక ఎలాగూ రిజెక్ట్‌ చేస్తారనే ఆలోచనతోనే దర్శకుడు సుకుమార్‌కు పంపారట. సినిమాలో ఆ పాట సందర్భంలో ఓ మసాలా ఐటెమ్‌ సాంగ్ ఆశించి ఉంటారు. కానీ దేవిశ్రీ ఆలోచన మరోలా ఉండిందట. జనాల్ని మైమరిపించే పాట అయితే బాగుంటుంది అంటూ ఆ పాట ట్యూన్‌ చేశారట.

సాంగ్ కంపోజ్ చేసిన తర్వాత ట్యూన్‌ పంపి, ఓ చిన్న నోట్ కూడా రాశారట. మీరు ఆశించిన దానికి భిన్నంగా నేను వేరే ట్యూన్ పంపిస్తున్నాను. నాకు పిచ్చి పట్టిందని అనుకోవచ్చు. ఈ పాటను రిజెక్ట్‌ చేయొచ్చు కూడా. కానీ ఈ పాటను సినిమాలో పెట్టండి, తెలుగు సినిమాల్లో ఐటెం పాటల స్టైల్‌నే ఈ పాట మారుస్తుంది అని నోట్‌లో రాశారట డీఎస్పీ. దేవిశ్రీ ఊహించినట్టుగానే పాట ప్రారంభంలో వినగానే, ఇదేంటి ఇంత స్లోగా ఉందని ఫీల్ అయ్యారట సుకుమార్.

అల్లు అర్జున్ విన్నాక కూడా ఇలాంటి ఫీలింగే వచ్చిందట. అయితే 30 సెకెన్ల తర్వాత పాట ఊపందుకున్నాక బన్నీ, సుకుమార్‌ హుషారుగా డ్యాన్స్‌కు సిద్ధపడ్డారట. అలా ఈ పాట ట్యూన్‌ సిద్ధం చేశానని, దానిని టీమ్‌ ఓకే చేసింది అని దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) చెప్పుకొచ్చారు. ఇప్పుడు అంతకుమించిన ఐటెమ్‌ సాంగ్‌ రెండో ‘పుష్ప’లో ఉండబోతోంది అట.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus