Devi Sri Prasad: శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాకి దేవి శ్రీ సంగీతం..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది ఓ బైలింగ్యువల్ మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టులో నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. ‘లవ్ స్టోరీ’ నిర్మాతలైన ‘ఎస్ ఎల్ వి సి సి’ బ్యానర్ వారే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.2024 జనవరి నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

ముంబై, కొచ్చి .. వంటి లొకేషన్లలో ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది అని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటి అంటే.. ధనుష్- శేఖర్ కమ్ముల ప్రాజెక్టుకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడట. శేఖర్ కమ్ముల ట్రాక్ రికార్డు కనుక చూసుకుంటే.. మొదటి నుండీ ఆయన కొత్త మ్యూజిక్ డైరెక్టర్లతోనే ఎక్కువగా పనిచేశారు.

కె.ఎం.రాధాకృష్ణన్, మిక్కీ జె మేయర్, శక్తికాంత్ కార్తీక్, పవన్ సి.హెచ్ వంటి సంగీత దర్శకులని టాలీవుడ్ కి పరిచయం చేసింది శేఖర్ కమ్ములనే అని చెప్పాలి. వీళ్ళందరూ కూడా తర్వాత బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ గా పేరు సంపాదించుకున్నారు. అయితే తన కెరీర్లో మొదటిసారి (Devi Sri Prasad) దేవి శ్రీ ప్రసాద్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తో శేఖర్ కమ్ముల పనిచేయబోతున్నాడు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus