Devi Sri Prasad: అదే గనుక నిజమైతే.. దేవి శ్రీ ప్రసాద్ బ్రాండ్ ఇక ఐపోయినట్లే!

ఒక్కోసారి కొన్ని వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ.. సదరు వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టినంతవరకు మాత్రం అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు అలాంటి ఎఫెక్ట్ ను ఫేస్ చేస్తున్నాడు దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad). నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. “పుష్ప 2”  (Pushpa 2)   నుండి దేవిశ్రీప్రసాద్ ను తప్పించారని, అతడి స్థానంలో తమన్ ను తీసుకున్నారని పలు అఫీషియల్ ఎకౌంట్స్ ద్వారా వార్త పోస్ట్ అయ్యింది.

Devi Sri Prasad

ఇప్పటికీ ఈ వార్తలో నిజమెంత అనేది క్లారిటీ లేదు కానీ.. జరిగే అవకాశం లేకపోలేదు అని అర్థమవుతోంది. సరిగ్గా 28 రోజుల్లో “పుష్ప 2” థియేటర్లలో విడుదలకావాల్సి ఉండగా.. ఇప్పటికే బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదంట. దేవి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ వెర్షన్ ఏమో అల్లు అర్జున్  (Allu Arjun)  & సుకుమార్ కి (Sukumar) అస్సలు నచ్చలేదట. మరో వెర్షన్ ఇవ్వమని కోరగా.. చాలా టైమ్ తీసుకుంటున్నాడట. అన్నిటికంటే ముఖ్యంగా..

సినిమా రిలీజ్ పెట్టుకుని మొన్నామధ్య హైదరాబాద్ లో చేసిన కాన్సర్ట్ కోసం ఏకంగా 15 రోజుల సమయాన్ని వృథా చేసుకున్నాడట దేవిశ్రీప్రసాద్. ఈ విషయమై బన్నీ, సుకుమార్ ఆల్రెడీ తమ అయిష్టతను తెలిపారట. అయితే.. సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ను మరీ అంత తీసిపారేయాల్సిన అవసరం కూడా లేదు. విడుదలైన టీజర్ తోనే తన సత్తా ఘనంగా చాటుకున్నాడు దేవిశ్రీప్రసాద్. మరీ ముఖ్యంగా తమన్ (S.S.Thaman), అనిరుధ్ (Amitabh Bachchan)  , జీవీ ప్రకాష్ (G. V. Prakash Kumar) లాంటి తన జూనియర్స్ దుమ్ము దులుపుతున్న ఈ తరుణంలో..

మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అయిన “పుష్ప 2”ను చేజేతులా వదులుకోడు దేవి. మరి దేవిని నిజంగానే తప్పించారా లేక ఎప్పట్లానే ఇవి కూడా కారు కూతలేనా అనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే.. “గుంటూరు కారం” టైంలో కూడా తమన్ ను తొలిగించి మరో మ్యూజిక్ డైరెక్టర్ తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయిస్తున్నారని గత ఎడాది కూడా ఇదే తరహా వార్తలొచ్చాయి. మరి “పుష్ప 2” విషయంలో ఏం జరుగుతుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus