మాస్ మహారాజ్ రవితేజ,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. వీకెండ్ ను సూపర్ గా క్యాష్ చేసుకున్న ఈ మూవీ నిన్న సోమవారం అయినప్పటికీ చాలా బాగా కలెక్ట్ చేసింది. కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఆదివారం వల్ల మిస్ అయిన హాలిడేని నిన్నటికి మార్చడంతో ధమాకా చిత్రానికి కలిసొచ్చినట్టు అయ్యింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 7.48 cr |
సీడెడ్ | 2.77 cr |
ఉత్తరాంధ్ర | 1.92 cr |
ఈస్ట్ | 0.88 cr |
వెస్ట్ | 0.71 cr |
గుంటూరు | 1.04 cr |
కృష్ణా | 0.95 cr |
నెల్లూరు | 0.51 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 16.26 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.35 cr |
ఓవర్సీస్ | 1.02 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 18.63 cr (షేర్) |
‘ధమాకా’ చిత్రానికి రూ.20.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.20.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.18.63 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.2.07 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
పోటీగా అవతార్ 2, 18 పేజెస్ వంటి చిత్రాలు ఉన్నా ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది అని చెప్పాలి. వీక్ డేస్ లో డీసెంట్ గా కలెక్ట్ చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?