మాస్ మహారాజ్ రవితేజ,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ విషయంలో సక్సెస్ అయిన ‘ధమాకా’ టీం మంచి థియేట్రికల్ బిజినెస్ కూడా జరిగేలా చేసింది అనే చెప్పాలి.
రవితేజ గత చిత్రాలు ‘ఖిలాడి’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు ప్లాపైనా.. వాటి ఎఫెక్ట్ ‘ధమాకా’ పై పడలేదు అనే చెప్పాలి. ఒకసారి ‘ధమాకా’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 5.80 cr |
సీడెడ్ | 2.70 cr |
ఉత్తరాంధ్ర | 2.35 cr |
ఈస్ట్ | 1.40 cr |
వెస్ట్ | 1.20 cr |
గుంటూరు | 1.60 cr |
కృష్ణా | 1.50 cr |
నెల్లూరు | 0.60 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 17.15 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.80 cr |
ఓవర్సీస్ | 1.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 20.45 cr (షేర్) |
‘ధమాకా’ చిత్రానికి రూ.20.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.20.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘రవితేజ’ గత రెండు సినిమాలు ఈ టార్గెట్ ను అయితే రీచ్ కాలేకపోయాయి. అయినా ‘ధమాకా’ చిత్రానికి మంచి కాంబినేషన్ సెట్ అయ్యింది కాబట్టి.. బిజినెస్ భారీగా జరిగినట్లు అర్థం చేసుకోవచ్చు.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?