Dhanush, Aishwarya: క్లారిటీ ఇచ్చేసిన ధనుష్‌.. ఐశ్వర్య.. వాళ్ల ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే!

కోలీవుడ్‌లో ఇటీవల కాలంలో విడాకుల మాటలు ఎక్కువగా వింటున్నాం. అయితే చాలా నెలల క్రితం వినిపించి ఇంకా తేలని ఓ విడాకుల కథ ఇప్పుడు ముగిసింది అని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని నెలలుగా నానుతున్న హీరో ధనుష్‌ (Dhanush)  – ఐశ్వర్య (Aishwarya) విడాకుల విషయంలో కోర్టులో దాదాపు తుది వాదనలు జరిగాయి అని చెప్పొచ్చు. ఈ క్రమంలో మేం కలసి ఉండాలని అనుకోవడం లేదు అంటూ ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారట.

Dhanush, Aishwarya:

వివాహ జీవితానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టి విడిపోవాలని ధనుష్, ఐశ్వర్య పూర్తి స్థాయి నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట విడాకుల కేసు విచారణకు ఇద్దరూ హాజరై.. తాము విడిపోవాలనుకుంటున్నట్లు న్యాయస్థానంలో తెలిపారు. దీంతో ఇద్దరూ మళ్లీ కలిసిపోతారంటూ వస్తున్న వార్తలు నిజం కావదని తేలిపోయింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో 18 ఏళ్లు వైవాహిక బంధానికి ఆ రోజు దాదాపుగా ముగింపు పలుకుతారు అని చెప్పొచ్చు.

ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకుండా.. మ్యూచువల్ అండర్ స్టాండింగ్తోనే విడిపోతున్నట్లు గతంలోనే ఇద్దరూ సోషల్‌ మీడియాలో పోస్ట్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. ధనుష్‌, ఐశ్వర్యను తిరిగి కలపడానికి ఇటు రజనీకాంత్‌ కుటుంబం, అటు ధనుష్‌ తండ్రి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల దీపావళి సందర్భంగా ధనుష్‌ను రజనీకాంత్‌ (Rajinikanth) ఇంటికి పిలిపించుకుని మాట్లాడారని వార్తలొచ్చాయి.

మీ ఇద్దరూ కలసి ఉండటమే తన కోరిక అని తలైవా చెప్పినట్లు ఆ వార్తల సారాంశం. అప్పుడు ఇద్దరూ మెత్తబడ్డారని వార్తలొచ్చినా ఇప్పుడు లేదని తేలిపోయింది. 20 ఏళ్ల క్రితం ధనుష్‌ – ఐశ్వర్య వివాహం అయింది. వీరికి యాత్ర, లింగ అని ఇద్దరు తనయులు ఉన్నారు. అయితే ధనుష్‌, ఐశ్వర్య ఎందుకు విడిపోవాలని అనుకున్నారు అనే విషయంలో మాత్రం ఇప్పటివరకు సరైన సమాచారం అయితే రాలేదు.

పారితోషికం విషయంలో తగ్గేదే లేదంటున్న వరుణ్ తేజ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus