Aishwarya: పేరు మార్చుకుని షాక్ ఇచ్చిన రజినీ కాంత్ కూతురు..!

ఇటీవల ధనుష్- ఐశ్వర్యలు విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసి.. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ వారు విడాకులు తీసుకోవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. వీళ్ళు విడిపోకుండా రజినీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. నిజానికి రజినీ ఒత్తిడి మేరకే వాళ్ళు ఇన్నాళ్ళు కలిసున్నారు. లేకుంటే 7 ఏళ్ళ క్రితమే వాళ్ళు విడాకులు తీసుకుని ఉండేవారట. మొన్నామధ్య వీళ్ళు మళ్ళీ కలవబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

Click Here To Watch NEW Trailer

కానీ ఆ ప్రచారంలో నిజం లేదని ఆమె తేల్చిచెప్పేసిందట ఐశ్వర్య. కానీ విడాకులకు సంబంధించిన లీగల్ ప్రొసీజర్లు ఇంకా మొదలుకాలేదు. ఒక్కసారి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయితే వీళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఐశ్వర్య తన పేరుని మార్చుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ట్విట్టర్లో ఐశ్వర్య ధనుష్ గా ఉండే ఆమె పేరుని ఇప్పుడు ఐశ్వర్య రజినీకాంత్ గా మార్చుకుంది. మార్చి 21న ధనుష్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఐశ్వర్య డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

అయితే ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఆమె పేరుని మార్చలేదు.త్వరలోనే ఇన్ స్టాగ్రామ్ టీంతో కూడా మాట్లాడి అందులో కూడా పేరు మార్పిస్తారని టాక్ నడుస్తుంది.ప్రస్తుతం ఐశ్వర్య తన ఫుల్ ఫోకస్ మొత్తం డైరెక్షన్ పైనే పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ మధ్యనే బాలీవుడ్లో ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు.’ఓ సాథి చల్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. హీరో, హీరోయిన్ల పేర్లు త్వరలోనే రివీల్ చేయనున్నారు.

ఇక ధనుష్ అయితే తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, హాలీవుడ్ లో కూడా ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే మామని మించిన అల్లుడు అనే పేరు తెచ్చుకున్న ధనుష్ తన మార్కెట్ ను మరింతగా పెంచుకునేందుకు శ్రమిస్తున్నాడు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus