తమిళ స్టార్ హీరో ధనుష్మ(Dhanush) , నయనతార (Nayantara) ధ్య నెలకొన్న వివాదం మరో మలుపు తిరిగింది. నయనతార జీవిత కథ, ఆమె విజయాలు, విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) తో ప్రేమ, వివాహం వంటి అంశాలను కవర్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన డాక్యుమెంటరీ బియాండ్ ద ఫెయిరీటేల్ వివాదానికి కేంద్రంగా మారింది. ఇందులో నానుమ్ రౌడీదాన్ చిత్రంలోని విజువల్స్ ధనుష్ అనుమతి లేకుండా వాడటం పెద్ద వివాదంగా మారింది. ధనుష్ నిర్మించిన ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు డాక్యుమెంటరీలో కనిపించాయి.
వీటి కోసం తన అనుమతి తీసుకోలేదని ధనుష్ తీవ్రంగా ఆగ్రహించారు. ఈ కారణంగా నయనతార, విఘ్నేష్ శివన్ పై కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఇదివరకే ధనుష్ డిమాండ్ చేయడంతో, నయనతార స్పందిస్తూ, “మూడుసెకన్ల విజువల్స్‌కి రూ.10 కోట్లు అడగడం అవాస్తవికం” అంటూ ధనుష్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వివాదం నడుమ, ధనుష్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు.
పిటిషన్‌లో, తన ప్రొడక్షన్ సంస్థ అనుమతి లేకుండా చిత్రంలోని విజువల్స్ వాడుకోవడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు దీనిని స్వీకరించి విచారణకు మంగళవారం తేదీని నిర్ణయించింది. నయనతార, విఘ్నేష్ శివన్ మాత్రం ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. “డాక్యుమెంటరీ కంటెంట్‌లో తమ జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపించడంలో తప్పేముంది?” అంటూ నయనతార ప్రశ్నించారు.
“ధనుష్ ఈ వివాదాన్ని ప్రాధాన్యత ఇస్తూ కోర్టుకు వెళ్ళడం అసంబద్ధం,” అని అన్నారు. మరోవైపు, ధనుష్ అభిప్రాయం ప్రకారం, కాపీరైట్ హక్కులు కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది” అని న్యాయవాదులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ధనుష్ చేసిన పిటిషన్ న్యాయపరంగా మరింత ముందుకు సాగుతుందని, కేసు ధనుష్ అనుకూలంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.