కోలీవుడ్ స్టార్ హీరోలను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి ఓ సినిమాను రూపొందిస్తున్నారు. దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలానే సూర్యతో తెలుగు స్ట్రెయిట్ సినిమా చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ఓ తెలుగు సినిమా రాబోతుంది. శేఖర్ కమ్ముల దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే రీసెంట్ గా ధనుష్ మరో సినిమా ఓకే చేసినట్లు సమాచారం.
తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ డైరెక్టర్ ఇటీవల ధనుష్ కి పూర్తి స్క్రిప్ట్ ను వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ధనుష్ నటించడానికి ఓకే చెప్పేశాడట. ఓ భారీ ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ ను చేపట్టనుంది. ఇదే గనుక నిజమైతే ధనుష్ తెలుగులోనే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. శేఖర్ కమ్ముల సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాను కూడా అలానే రూపొందిస్తారో లేదో చూడాలి.
ఇక ఈ రెండు సినిమాల్లో దేన్ని ముందుగా మొదలుపెడతారనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే శేఖర్ కమ్ముల దగ్గర స్క్రిప్ట్ రెడీగా లేదు. కేవలం లైన్ చెప్పి ధనుష్ ని ఒప్పించారు. ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. కానీ ఈ యంగ్ డైరెక్టర్ దగ్గర మాత్రం స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!