‘తిక్క’ టైటిల్ సాంగ్ పాడిన తమిళ ధనుష్

ఓ స్టార్ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది తమిళ స్టార్ హీరో ధనుష్… టాలీవుడ్ సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కోసం ఓపాట పాడటం విశేషం. అంతే కాదు ఓ తెలుగు హీరో కోసం ధనుష్ తెలుగులో పాడటం ఇదే ఫస్ట్ టైం. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ… తమన్ స్వరపరచిన తిక్క చిత్రంలోని టైటిల్ సాంగ్ ను ధనుష్ పాడటంతో తిక్క చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించిన ఈ టైటిల్ సాంగ్ ని ధనుష్ ఫుల్ జోష్ తో పాడారు. ‘తిక్క… తిక్క’ అంటూ సాగే ఈ సాంగ్ హైలైట్ గా ఉంటుంది. అందుకే ధనుష్ తో పాడించడం జరిగిందని చిత్ర నిర్మాత రోహిన్ రెడ్డి తెలిపారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత డాక్ట‌ర్‌.సి.రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నిర్మిస్తున్నతిక్క చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇటీవలే లడఖ్ లోని అందమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించాం. అత్యద్భుతంగా వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ రేంజ్ కు తగ్గట్టుగా లావిష్ గా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పాజిటివ్ వైబ్రేషన్స్ తో షూటింగ్ జరుపుకున్న తిక్క చిత్ర టైటిల్ సాంగ్ ను తమిళ స్టార్ హీరో.. తెలుగు సినీ అభిమానులు అమితంగా ఇష్టపడే ధనుష్ పాడటతో చాలా హ్యాపీగా ఉన్నాం. ధనుష్ కు ఈ పాట నచ్చడం.. టోటల్ గా ప్రాజెక్ట్ కు ఇంప్రెస్ అయి ధనుష్ ఈ పాట పాడాడు. అంతే కాదు తెలుగులో ఆయన ఓ హీరోకు పాట పాడటం కూడా ఫస్ట్ టైం కావడం విశేషం. ప్రముఖ రచయిత రామ జోగయ్య శాస్త్రి దర్శకుడు సునీల్ రెడ్డి చెప్పిన సందర్భానికి తగ్గట్టుగా అద్భుతమైన సాహిత్యమందించారు. తమన్ ఈ టైటిల్ సాంగ్ ను ప్రత్యేక శ్రద్ధతో సాయి ధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ ను, ఆయన చేసే డ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని కంపోజ్ చేశారు. ధనుష్ సైతం ఈ పాట పాడినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు. చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక జులై 30న చిత్ర ఆడియోను రిలీజ్ చేసి…. ఆగస్ట్ 13న గ్రాండ్ గా తిక్క చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. అని అన్నారు.

దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ…. ముందుగా స్టార్ హీరో ధనుష్ గారికి చాలా థాంక్స్ చెప్పాలి. ఆయన ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలిసిందే. అలాంటిది మా తిక్క కోసం టైటిల్ సాంగ్ పాడి సినిమాకు మరింత క్రేజ్ యాడ్ చేశారు. ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం చాలా బాగుంది. టైటిల్ సాంగ్స్ లో తిక్క సాంగ్ నిలిచిపోయేలా తమన్ స్వరపరిచారు. నిర్మాత రోహిన్ రెడ్డి చాలా ఇష్టంతో ఈ సినిమాను గ్రాండియర్ గా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తిక్క ఉంటుంది. ఆగస్ట్ 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. అని అన్నారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ… తిక్క చిత్రంలోని టైటిల్ సాంగ్ కంపోజిషన్ అద్భుతంగా ఉంటుంది. అలాంటి పాటను స్పెషల్ పర్సన్ పాడితే వచ్చే ఆ క్రేజ్ వేరు. అందుకే నాకు బాగా ఇష్టమైన ధనుష్ గారిని అడగడం ఆయన ఓకే చేయడం…. పాడేయడం జరిగింది. ఆయన పాడటంతో పాటతో పాటు సినిమాకు స్పెషల్ క్రేజ్ దక్కింది. ధనుష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమన్ టైటిల్ సాంగ్ ని అద్భుతంగా కంపోజ్ చేశాడు. టోటల్ గా సూపర్ హిట్ ఆల్బమ్ అందించబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సునీల్ రెడ్డి తీర్చిదిద్దారు. నిర్మాత రోహిన్ రెడ్డి ఫస్ట్ సినిమానే అయినప్పటికీ ఖర్చుకు వెనకాడకుండా కథకు తగ్గట్టుగా గ్రాండియర్ గా నిర్మించారు. జులై 30న ఆడియో రిలీజ్ చేస్తాం. ఆగస్ట్ 13న ప్రపంచవ్యాప్తంగా తిక్క రిలీజ్ చేయబోతున్నాం. అని అన్నారు.

న‌టీన‌టులు..

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆలి, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, ర‌ఘుబాబు, ప్ర‌భాస్ శ్రీను, స‌త్య‌, ఆనంద్‌, వి.జే.భాని, కామ్నా సింగ్‌ న‌టించ‌గా..

టెక్నిషియ‌న్స్‌..
నిర్మాత‌- డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి,
ద‌ర్శ‌కత్వం- సునీల్ రెడ్డి,
స‌హ‌నిర్మాత‌-కిర‌ణ్ రంగినేని,
కెమెరా- కె.వి.గుహ‌న్‌
సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌
ఎడిట‌ర్‌- కార్తీక్ శ్రీనివాస్‌
ఆర్ట్‌- కిర‌ణ్ కుమార్‌
క‌థ‌- షేక్ దావూద్‌
మాట‌లు- హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌
డాన్స్‌- ప్రేమ్ ర‌క్షిత్‌
యాక్ష‌న్‌- విలియ‌మ్ ఓ.ఎన్‌.జి, రామ్‌-లక్ష్మ‌ణ్‌, ర‌వివ‌ర్మ‌, జ‌ష్వా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus