Dhanush: తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి ధనుష్ రెడీ!

సెలబ్రిటీలు వేరే భాషల్లో సినిమాలు చేసినప్పుడు డబ్బింగ్ కోసం వేరే వ్యక్తుల సాయం తీసుకుంటారు. దీనికోసం డబ్బింగ్ ఆర్టిస్ట్ లు రెడీగా ఉంటారు. డబ్బింగ్ కోసం కూడా బాగానే ఖర్చు చేస్తుంటారు మన దర్శకనిర్మాతలు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడినుంచో వచ్చిన హీరోయిన్లు, కొందరు హీరోలు మన దగ్గర సొంతంగా డబ్బింగ్ చెప్పేస్తున్నారు. ఇప్పటికే సాయిపల్లవి, మమ్ముట్టి, పూజాహెగ్డే ఇలా చాలా మంది డబ్బింగ్ అవసరం లేకుండా సొంతంగా వాయిదా ఇస్తున్నారు.

ఇప్పుడు ధనుష్ కూడా ఇదే లిస్ట్ లో చేరారు. ఇప్పటివరకు కోలీవుడ్ లో సినిమాలు చేసిన ధనుష్ తొలిసారి తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటిస్తున్నారు. దీనికి వెంకీ అట్లూరి దర్శకుడిగా పని చేస్తున్నారు. దీనికి ‘సార్’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటానని ధనుష్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ను కమర్షియలైజ్ చేయడం వంటి వ్యవహారాల నేపథ్యంలో ఈ కథను రాసుకున్నారు వెంకీ అట్లూరి.

ఈ సినిమాలో ధనుష్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారట. గెటప్స్ అంటే కథాగమనం ప్రకారం ఏజ్ లుక్స్ ను బట్టి వచ్చే చేంజెస్ ను చూపించబోతున్నారు. వీటితో పాటు ఓ సర్ప్రైజ్ లుక్ కూడా ఉంటుందట. దాన్ని మాత్రం రివీల్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేయబోతున్నారు ధనుష్. నిజానికి ముందుగా శేఖర్ కమ్ముల సినిమా మొదలుకావాల్సింది కానీ కొన్ని కారణాల వలన వెంకీ అట్లూరి సినిమాను మొదలుపెట్టారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus