కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతున్న సంగతి తెలిసిందే. అప్పుల వల్లే చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడంటూ వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ వార్తలు ఆయన అభిమానులకు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. చైతన్య అప్పుల గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఆయన మేనమామ ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చైతన్య ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేంత పిరికివాడు అయితే కాదని ఆయన అన్నారు.
చైతన్యకు పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని అయితే నేను మాత్రం అప్పులు ఉన్నాయని అనుకోవడం లేదని ఆయన కామెంట్లు చేశారు. చైతన్యకు లక్షల రూపాయల అవసరం ఏముందని ఒకవేళ అంత పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అయినా ఆ రేంజ్ లో సహాయం చేసే వ్యక్తులు ఎవరు ఉంటారని అయన ప్రశ్నించారు. పదివేలు, పదిహేను వేల కంటే చైతన్య ఎక్కువ అప్పు చేయడని ఆయన తెలిపారు.
తన ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉందని చైతన్య మేనమామ చెప్పుకొచ్చారు. చైతన్య నుంచి రూపాయి కూడా తీసుకోకుండానే చెల్లి పెళ్లి చేశామని చైతన్య ఆదాయంపై కుటుంబం ఏరోజు ఆధారపడలేదని ఆయన కామెంట్లు చేశారు. డబ్బులు అవసరమైతే కుటుంబ సభ్యులే చైతన్యకు ఇచ్చేవాళ్లు అని ఆయన కామెంట్లు చేశారు. చైతన్యకు ఊరిలో 30 ఎకరాల భూమి ఉందని చైతన్య మేనమామ చెప్పుకొచ్చారు.
చైతన్య మేనమామ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రద్ధాదాస్, రష్మీ గౌతమ్, శేఖర్ మాస్టర్ చైతన్య మరణవార్త విని ఎమోషనల్ అయ్యారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న చైతన్య ఈ విధంగా చేయడం బాధ పెడుతోందని నెటిజన్లు చెబుతున్నారు. అతి త్వరలో చైతన్య మృతికి సంబంధించి పూర్తి కారణాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. చైతన్య మృతికి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సంతాపం తెలుపుతున్నారు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా