నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా శృతి హాసన్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. ‘వైర ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM) డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శౌర్యువ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టీజర్, ట్రైలర్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతంలో రూపొందిన పాటలు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి.
ఆల్రెడీ ‘సమయమా’, ‘గాజు బొమ్మ’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా ‘ఒడియమ్మ’ అనే లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. చూస్తుంటే ఇది సినిమాలో వచ్చే పార్టీ సాంగ్ అని తెలుస్తుంది. ఇందులో నాని, శృతి హాసన్ డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి. ఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటి అంటే.. ఈ పాటని శృతి హాసన్, చిన్మయి..లతో కలిసి తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు అయిన ధృవ్ విక్రమ్ కూడా పాడాడు.
అవును ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) కూడా ఈ పాటని హుషారెత్తించే విధంగా పాడాడు అని చెప్పాలి. ఈ పాటతో అతను టాలీవుడ్ కి సింగర్ గా ఎంట్రీ ఇచ్చినట్టు అయ్యింది. ఆల్రెడీ తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన ధృవ్ విక్రమ్, సింగర్ గా కూడా అక్కడ పలు పాటలు పాడాడు. అవి కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ లోని ‘ఒడియమ్మ’ అనే పాటతో తెలుగు సంగీత ప్రియులను కూడా అలరించడానికి రెడీ అయ్యాడు అని చెప్పాలి.