‘ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. తాజాగా అది రూ.1000 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. అవును ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఈ మైలురాయిని అధిగమించడం అనేది రణ్వీర్ సింగ్ కి ఇదే మొదటిసారి.డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం 21 రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరినట్టు తెలుస్తుంది.
ఈరోజు అనగా డిసెంబర్ 26 నాటికి వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1006.7 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.ఇండియాలోనే రూ.660 కోట్లు నెట్ కలెక్షన్స్ ను సాధించింది ఈ సినిమా.కొన్ని నెలల నుండి చూసుకుంటే బాలీవుడ్లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది లేదు. 2025 లో కూడా ఇదే మొదటి హిందీ సినిమా కావడం విశేషం.
పుష్ప 2′ తర్వాత వెయ్యి కోట్లు కోళ్ల గొట్టిన సినిమా ఇదే. ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్ ఈ సినిమాని స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.దీనికి సీక్వెల్ కూడా ఉంది. ‘ధురంధర్ 2′ పేరుతో 2026 మార్చి 19న విడుదల కానుంది ఆ సినిమా.’ధురంధర్’ లో రణవీర్ సింగ్ లీడ్ రోల్ పోషించగా.. సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా ,అర్జున్ రాంపాల్ వంటి స్టార్లు అత్యంత కీలక పాత్రలు పోషించారు. మాధవన్ రోల్ కి మంచి మార్కులు పడ్డాయి.