Pushpa2: లీకైన ‘పుష్ప2’లో పవర్‌ఫుల్‌ డైలాగ్!

  • December 12, 2022 / 03:19 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకి పార్ట్ 2 రాబోతుంది. ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ ను ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని డైలాగులు లీక్ అయ్యాయి. ‘అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్ధం’ అనేది ఒక డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చాలానే ఉన్నాయట. అయితే ఈ పులి డైలాగ్ ఎలా లీక్ అయిందనేది మాత్రం తెలియదు.

ఇప్పటివరకు ఈ డైలాగ్ పై టీమ్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ‘అవతార్ 2’ సినిమా డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అదే రోజున ఆ సినిమాతో పాటు ‘పుష్ప2’ గ్లింప్స్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లీకైన డైలాగ్ గ్లింప్స్ లో వినిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

అనసూయ, సునీల్, రావురమేష్ లాంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పార్ట్ 2లో మరో విలన్ కూడా ఉంటాడని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus