బోయపాటి…కొరటాలను మోసం చేశాడా??

ఇప్పుడున్న టాలీవుడ్ లో బోయపాటి సీను….కొరటాల శివ ఇద్దరూ తమ టాలెంట్ తో, సూపర్ హిట్స్ ఇస్తూ…దూసుకుపోతున్నారు. ఇంకా చెప్పాలి అంటే…ఇద్దరూ ఒకే రకం అయిన మాస్, యాక్షన్ బ్యాక్‌డ్రొప్ తో వరుస సినిమాలు తీస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీసిన కొరటాల ఒక ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటెర్వ్యులో  ఇన్‌డైరెక్ట్ గా దర్శకుడు బోయపాటి సీను నన్ను మోసం చేశాడు అని తెలిపాడు..అసలు ఏం జరిగింది అంటే….గతంలో మనోడు మిర్చి సినిమా రిలీజైనప్పుడు.. కొంతమంది దర్శకులు తనకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వకపోవడం వలనే రైటర్ నుండి ఇలా దర్శకుడిగా మారాల్సి వచ్చిందని కొరటాల చెబుతూ…అదే క్రమంలో తానను బోయపాటి ఇబ్బంది పెట్టాడు అని తెలిపాడు.

ఆ విషయాన్ని వివరిస్తూ….అప్పట్లో ‘సింహా’ సినిమాకు కథ అండ్ మాటలు నేనే రాశాను. అయితే బోయపాటి మాత్రం కావాలంటే ‘మాటలు’ క్రెడిట్ తీస్కో లేదంటే ‘కథ’ క్రెడిట్ తీస్కో అన్నాడట. అలాగైతే రెండూ వద్దు నాకు అంటూ వర్కును బోయపాటి చేతిలో పెట్టేసి కొరటాల బయటకొచ్చేశాడట మన దర్శకుడు. అంతా బాగానే ఉంది కానీ…ఇప్పుడు బోయపాటి పేరు ఎందుకు బయట పెట్టాడో అర్ధం కావడంలేదు. ఏది ఏమైనా…ఇండస్ట్రీలో ఇవన్నీ సర్వ సహజం అనే చెప్పాలి….సినిమాలు కాపీ, పాటలు కాపీ, కధలు కాపీ…ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి. అవకాశం కోసం అవతల వారి అవసరాలకు ఉపయోగపడటం తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus