త్రివిక్రమ్‌తో వివాదానికి దేవీ ముగింపు ఇవ్వాలనుకున్నాడా?

‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ లాంటి త్రివిక్రమ్‌ హిట్‌ సినిమాలకు సంగీతమందించాడు దేవిశ్రీప్రసాద్‌. దీంతో గురూజీ – దేవిశ్రీప్రసాద్‌ కాంబో చాలా సినిమాలకు కంటిన్యూ అవుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ‘అ ఆ’ సినిమాకు మిక్కీ జే మేయర్‌ను తీసుకున్నాడు త్రివిక్రమ్‌. దేవీ బిజీగా ఉన్నాడేమో మిక్కీ వచ్చాడని అనుకున్నారు. అయితే ‘అజ్ఞాతవాసి’కి కూడా డీఎస్పీని పక్కనపెట్టేసరికి ఇద్దరి మధ్య ఏదో జరిగింది అనుకున్నారు. అయితే ఈ విషయంలో ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా దేవిశ్రీ చేసిన కామెంట్స్‌ ఆ పుకార్లకు చెక్‌ పెట్టేలా కనిపిస్తున్నాయి.

‘‘నేపథ్య సంగీతంతో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చూశాక అల్లు అర్జున్‌కీ, నిర్మాతకీ దర్శకుడు త్రివిక్రమ్‌ ఫోన్‌ చేసి ‘మనం రూపాయి సినిమా తీస్తే, దేవి రెండు రూపాయల సినిమా చేసేశాడ’ని చెప్పారట’’ అంటూ దేవిశ్రీప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. ‘ఉప్పెన’ సినిమా గురించి చెబుతూ ఇలా అన్నాడు దేవీ. త్రివిక్రమ్‌కి, దేవీకి టర్మ్స్‌ సరిగ్గా లేవని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేవీ ఇలా అనడం వెనుక చాలా కారణాలున్నాయేమో అనిపిస్తోంది. మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని చెప్పడం దేవీ ఉద్దేశమా. లేక అన్యాపదేశంగా చెప్పాడా అనేది తెలియాలి.

మరోవైపు మ్యూజిక్‌ డైరక్టర్లతో త్రివిక్రమ్‌ ఇష్యూస్‌ చాలానే వినిపిస్తుంటాయి. దేవిశ్రీప్రసాద్‌తో ఇష్యూ ఒకటి అయితే, అనిరుధ్‌తో మరొకటి. ‘అజ్ఞాతవాసి’ సమయంలో అనిరుధ్‌తో త్రివిక్రమ్‌ ఇబ్బంది పడ్డాడని వార్తలొచ్చాయి. అందుకే ‘అరవింద సమేత’ సినిమాకు అతనిని ఎంచుకొని పక్కన పెట్టారనే వార్తలూ వచ్చాయి. ఇప్పుడు దేవిశ్రీప్రసాద్‌ ఇలా అంటున్నాడు. మరి దీనిపై త్రివిక్రమ్‌ అయితే స్పందించరు. వచ్చే సినిమాలో కలసి పని చేస్తే ఇద్దరి మధ్య ఏమీ లేదు అనుకోవచ్చు. చూద్దాం ఏమవుతుందో?

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus