అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) 2014 టైంలో డీప్ లవ్లో ఉన్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కడానికి 3 ఏళ్ళు టైం పట్టింది. 2017 లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్ళంత బెస్ట్ కపుల్.. టాలీవుడ్లో లేరు అన్నట్టు అంతా చెప్పుకున్నారు. 3 ఏళ్ళ పాటు ఈ జంట హ్యాపీగా జీవించింది. కానీ ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021 లో విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయారు.
ఆ తర్వాత చైతన్య జ్ఞాపకాల నుండి దూరంగా వెళ్లిపోవాలని సమంత డిసైడ్ అయ్యింది. అలా హైదరాబాద్ నుండి ముంబైకి మకాం మార్చేసింది. తర్వాత చైతన్య ఇచ్చిన బహుమతులను సైతం ఆమె వెనక్కి పంపేసింది. కానీ డైమండ్ రింగ్ విషయంలో మాత్రం క్లారిటీ మిస్ అయ్యింది. విషయంలోకి వెళితే.. సమంత- నాగ చైతన్య ఎంగేజ్మెంట్ రోజున.. సమంత చేతికి 3 క్యారెట్స్ ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ ను తొడిగాడు చైతన్య.
ఆమె మీడియా ముందుకు వచ్చిన చాలా సందర్భాల్లో ఆ డైమండ్ రింగ్ బయటపడింది. దానిపై కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే తర్వాత.. అంటే చైతన్యతో విడిపోయాక ఆ డైమండ్ రింగ్ సమంత చేతి వేళ్ళ పైన కనిపించడం లేదు. దీంతో ఆ డైమండ్ రింగ్ ఏమైంది? అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. సమంత ఆ డైమండ్ రింగ్ ను పెండెంట్ గా మార్చుకున్నట్టు తెలుస్తుంది. దానిని ఆమె చైన్ కి ధరించి మెడలో వేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది.