బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్ నడుస్తోంది. ఈవారం హౌస్ మేట్స్ కి కెప్టెన్సీ రేస్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో మూడు రకాలైన ఛార్జ్ లని హౌస్ మేట్స్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫుడ్ అంటే ఆహారం కావాలంటే 15% ఛార్జింగ్ ని, ఆడియోకాల్ కోసం 30% ఛార్జింగ్ ని, అలాగే వీడియో కాల్ కోసం 35% ఛార్జింగ్ ని త్యాగం చేయాలి. ఇందులో ప్రతి హౌస్ మేట్ కి కన్ఫెషన్ రూమ్ లో దీనిని ఉపయోగించుకోవాలి.
అయితే, ఇందులో ఎవరెవరు ఏం చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ కి పార్టిసిపెంట్స్ వచ్చి 5వారాలు గడుస్తున్నాయి. హౌస్ లో ఇప్పటికే చాలామంది ఇంటిసభ్యులకి అలవాటు పడుతున్నారు. కుటుంబాలని వదిలేసి ఒక ఇంట్లో ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఎమోషనల్ గా ఆడియోకాల్, వీడియోకాల్, ఫుడ్ అనే ఆప్షన్ ఇచ్చేసరికి ఇంటి సభ్యులు ఎవరు ఏం ఉపయోగించుకున్నారు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. నిజానికి ప్రోమోలో చూపించిన విధంగా శ్రీహాన్ వాళ్ల ఫాదర్ తో వీడియోకాల్ మాట్లాడాలని అనుకున్నాడు.
కానీ, తర్వాత ఫుడ్ కోసం మాత్రమే ఛార్జింగ్ ఉపయోగించినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక మిగతా హౌస్ మేట్స్ కూడా కొన్ని పాయింట్స్ ని వాడుకున్నారు. వీళ్లలో ఆదిరెడ్డి ఇంటి నుంచీ వీడియోకాల్ మాట్లాడేందుకు 35శాతం బ్యాటరీని వాడుకున్నాడు. అలాగే, సుదీప ఇంటి నుంచీ ఆడియోకాల్ మాట్లాడి 30 పర్సెంట్ బ్యాటరీని వాడుకుంది. ఈ టాస్క్ లో మొత్తం మూడు లెవల్స్ ఉంటాయి. ఈ మూడు లెవల్స్ లో ఏదైనా వాడుకుంటే ఇంట్లో కొన్ని ఛాలెంజస్ ఫేస్ చేయాలి. అప్పుడు బ్యాటరీ ఇంక్రీజ్ అవుతుంది.
లేదంటే బ్యాటరీ డిక్రీజ్ అయిపోయి టాస్క్ నుంచీ తొలగిపోవాల్సి ఉంటుంది. ఈ కెప్టెన్సీ రేస్ టాస్క్ లో ఎవరు గెలిచారు. చివరి వరకూ బ్యాటరీని ఎవరు నిలుపుకున్నారు అనేది చూడాలి. అంతేకాదు, ఈ టాస్క్ రెండు రోజులు ఉంటుందని చెప్తున్నారు. ఈలోగా బ్యాటరీని రీఛార్జ్ చేసుకునే అవకాశం కూడా బిగ్ బాస్ ఇస్తాడని ఆ టైమ్ లో రూల్స్ అన్నీ పాటిస్తే తిరిగి గేమ్ లోకి రావచ్చని కూడా సమాచారం. మొత్తానికి ఈ బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ ఆడియన్స్ కి మంచి మజా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదీమేటర్.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!