సుకుమార్ మర్చిపోయాడా లేక పక్కన పెట్టేశాడా?

‘రామ్‌తో (Ram) సినిమా చేయాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. త్వరలో కచ్చితంగా అతనితో సినిమా చేస్తా. యాక్చువల్లీ… ఇప్పటి రామ్‌తో మళ్ళీ ‘జగడం’ (Jagadam) రీమేక్ చేయాలని ఉంది. మళ్ళీ ఇప్పటి రామ్‌తో మళ్ళీ ‘జగడం’ చూసుకోవాలని ఉంది’.. ఇవి సరిగ్గా 4 ఏళ్ళ క్రితం ‘పుష్ప'(ది రైజ్) (Pushpa) సినిమా టైంలో సుకుమార్ (Sukumar) చేసిన కామెంట్స్. మధ్యలో 3 ఏళ్ళు ఆయన ‘పుష్ప 2’ (Pushpa 2) తో బిజీగా గడిపాడు. ఇప్పుడు రాంచరణ్ (Ram Charan) సినిమా కథపై వర్క్ చేస్తున్నాడు.

Sukumar

అయితే అది బుచ్చిబాబు (Buchi Babu Sana)  సినిమా కంప్లీట్ అయ్యాకే మొదలవుతుంది. ఈ గ్యాప్లో సుకుమార్ .. ఏం చేస్తాడు? చరణ్ సినిమా కంప్లీట్ అయ్యేసరికి 2025 అయిపోతుంది. ఈ క్రమంలో ‘మా అభిమాన హీరోతో’ ఒక సినిమా చేయాలని రామ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో ‘జగడం’ అనే సినిమా వచ్చింది. 2007 మార్చి 16న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఇది పెద్దగా ఆడలేదు. రామ్ కి ఇది రెండో సినిమా.

ఈ సినిమా టైంకి అతని వయసు కేవలం 17 ఏళ్ళు. అయినా సరే పెర్ఫార్మన్స్ లో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. అది దర్శకుడి సుకుమార్ ప్రెజెంటేషన్ కి ఉన్న పవర్ అని చెప్పాలి. ఇందులో ప్రతి సీన్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ మార్చి 16 కి 18 ఏళ్లు పూర్తి కావస్తోంది. ‘జగడం’ రీ- రిలీజ్ కోసం చూసే వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు.

అయితే ఇంకొంతమంది సుకుమార్.. మంచి కథ డిజైన్ చేసుకుని రామ్ తో చేయొచ్చు కదా అని మరి కొందరు సోషల్ మీడియాలో డిస్కషన్ పెట్టుకుంటున్నారు. రామ్ ప్రస్తుతం మైత్రిలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) దర్శకుడు మహేష్ బాబుతో (Mahesh Babu P) ఒక సినిమా చేస్తున్నాడు. ఈలోపు మరి సుకుమార్ ఏమైనా రామ్ ఇమేజ్ కి సరిపడా కథ రెడీ చేస్తాడేమో చూడాలి.

‘బ్రహ్మోత్సవం’ టైంలో మర్చిపోయారు.. ‘సీతమ్మ వాకిట్లో’ రీ- రిలీజ్ కి గుర్తొచ్చినట్టుంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus