Mathu Vadalara 2: ‘మత్తు వదలరా 2’ ప్రమోషనల్ కంటెంట్లో ఇది గమనించారా?

2019 ఎండింగ్లో పెద్దగా చప్పుడు చేయకుండా వచ్చిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara)  చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ ఈ చిత్రాన్ని ఎగబడి చూశారు. ఓటీటీలో కూడా ఈ చిత్రాన్ని రిపీట్స్ లో చూసిన ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సత్య కామెడీ ఈ చిత్రానికి మేజర్ హైలెట్ అని చెప్పుకోవచ్చు. హీరో సింహా కోడూరి  (Sri Simha Koduri)  కంటే కూడా సత్య నటనకి ఎక్కువ మార్కులు పడ్డాయి.

Mathu Vadalara 2

‘దొంగతనం కాదు తస్కరించడం’ అని అతను పలకడం, అలాగే బాలకృష్ణ (Balakrishna) సమరసింహారెడ్డి (Samarasimha Reddy)  గెటప్లో కనిపించడం వంటివి ఆడియన్స్ ని పడి పడి నవ్వేలా చేశాయి. దర్శకుడు రితేష్ రానా.. సత్యని  (Satya Akkala)  స్టార్ కమెడియన్ ని చేశాడు అని కూడా చెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ 13న ‘మత్తు వదలరా 2’ కూడా విడుదల కాబోతుంది. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలయ్యిందో.. చాలా మందికి తెలీదు. అప్పుడే షూటింగ్ కంప్లీట్ అంటున్నారు.

ఎల్లుండి.. అంటే ఆగస్టు 30న టీజర్ ను కూడా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. గత 3 రోజుల నుండి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంది ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) టీం. మొదట రిలీజ్ డేట్ పోస్టర్ ను వదిలారు. తర్వాత హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)  పాత్రకు సంబంధించిన లుక్ వదిలారు. ఈరోజు టీజర్ రిలీజ్ డేట్ తెలుపుతూ ఇంకో పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ 3 పోస్టర్స్ ను గమనిస్తే.. అందులో 2 పోస్టర్లలో హీరోతో పాటు కమెడియన్ సత్య కూడా ఉన్నాడు. సో సీక్వెల్లో కూడా సత్య కామెడీకి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. కమెడియన్ ఎంత బాగా చేసినా.. సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరో అకౌంట్లో కూడా పడుతుంది. సో సత్య కామెడీతో… ప్లాపుల్లో ఉన్న హీరో సింహా కోడూరి కూడా గట్టెక్కేసే ఛాన్స్ ఉంది.

ఆ వీడియోలను వైరల్ చేస్తున్న బన్నీ అభిమానులు.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus