Bigg Boss 5 Telugu: మోజ్‌ బ్యాచ్‌ కొంపముంచిన సీక్రెట్‌ టాస్క్‌

‘టాస్క్‌ల్లో ఫ్రెండ్‌షిప్‌ ఏంటి… ఎవరి ఆట వారు ఆడాలి కానీ..’ ఈ మాట బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో ఎక్కడో విన్నట్లుంది కదా. ఎక్కడో కాదు మొన్నీమధ్య షన్ను అలియాస్‌ షణ్ముఖ్‌ నోటి వెంట వచ్చిన వాక్యాలు ఇవి. హంటర్‌ టాస్క్‌లో సన్నీ… తన ఫ్రెండ్స్‌ని కాకుండా మిగిలిన వారిని నామినేట్‌ చేయడానికి ట్రయ్‌ చేస్తుంటే అన్నాడు. అయితే ఇప్పుడు తనవరకు వచ్చేసరికి ఫ్రెండ్‌షిప్‌ టాపిక్‌ వచ్చేసింది. ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇవ్వలేదని బాధపడిపోయాడు.

బిగ్‌బాస్‌ ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ ప్రకారం ముగ్గురు ఇంటి సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా చూసుకోవడం జశ్వంత్‌ పని. ఈ క్రమంలో ఒక హౌస్‌మేట్‌గా షన్నును ఎంచుకున్నాడు జశ్వంత్‌. అందుకు తగ్గట్టే ఒప్పించి… గుడ్లు లేకుండా చేశాడు. ఈ క్రమంలో టాస్క్‌ సరిగ్గా అర్థం చేసుకోక ఓడిపోయాడు అనుకోండి. అయితే తనను ‘జీరో’ చేశారు అని షణ్ముఖ్‌ బాధపడ్డాడు. ఇంకా చెప్పాలంటే బాగా డిప్రెస్‌ అయిపోతున్నాడు. తిండి తిప్పలు మానేసి ఓ మూలకు ఒక్కడే కూర్చుండిపోయాడు.

అంతేకాదు… సిరిని కూడా తెగ తిట్టేశాడు. నీకు నాకంటే జెస్సీనే ఎక్కువయ్యాడు కదా అని అనేశాడు. దీంతో సిరి కూడా ఏడ్చేసింది. మరోవైపు జెస్సీ నచ్చజెప్పడానికి వస్తే… ‘నువ్వు ఎవడివి రా’ అంటూ జెస్సీని తిట్టేశాడు. దీంతో జెస్సీ కూడా దూరంగా వెళ్లి బాధపడ్డాడు. ‘ఫ్రెండ్‌ కోసం ఏం జరిగిందనేది తెలియకుండానే స్టాండ్‌ తీసుకుంటా’ అంటూ ఆ మధ్య శ్రీరామ్‌తో గొడవ సందర్భంగా షన్ను అన్నట్లు గుర్తు. ఇప్పుడు తనదాకా వచ్చేసరికి ఆ ఫ్రెండ్‌షిప్‌ పోయిందా అని నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు.

జెస్సీ సీక్రెట్‌ టాస్క్‌ ఓడిపోయిన సందర్భంలో ‘నాక్కూడా ఓ సీక్రెట్‌ టాస్క్‌ ఇవ్వండి బిగ్‌బాస్‌’ అని షన్ను అన్నాడు. దీనికి కౌంటర్‌గా ‘నువ్వు ముందు టాస్క్‌ సరిగ్గా ఆడు’ అన్నాడు రవి. దీంతో షన్ను ఇంకా హర్ట్‌ అయ్యాడు. ఆ మాటకొస్తే… ఇంతకుమించిన మాటలు రవిని గతంలో అన్నాడు షన్ను. మాట తీసుకోని షన్ను… అందరినీ జడ్జి చేస్తుంటాడు. అదన్నమాట సంగతి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus