ఆ విషయంలో నాగబాబు, వరుణ్ లకు అభిప్రాయ భేదాలు?

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలే తన ఇద్దరు పిల్లల పెళ్లిళ్ల గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూతురు నిహారికి పెళ్లిపై అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ క్లారిటీ ఇచ్చి వుంటారు అనే వాదన ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభములో నిహారిక పెళ్లి ఉండే అవకాశం కలదని ఆయన చెప్పారు. అలాగే నిహారిక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుందని, సంబంధాలు చూడాలి అని ఆయన స్పష్టత ఇచ్చారు.

పనిలో పనిగా వరుణ్ పెళ్లి గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. వరుణ్ కి కూడా వచ్చే ఏడాది పెళ్లి చేసే ఆలోచన ఉందని నాగబాబు అన్నారు. వారిద్దరి పెళ్లిళ్ల బాధ్యత తీరిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అని నాగబాబు తన అభిప్రాయం వ్యక్త పరిచారు. కాగా హైదరాబాద్ కి చెందిన ఓ వ్యాపార వేత్త కూతురితో వరుణ్ పెళ్లి జరుగనుంది అనే ఓ ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో వరుణ్ పెళ్లి విషయంలో నాగబాబు కి మరియు వరుణ్ కి మధ్య వివాదం తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి.

వరుణ్ పెళ్లి విషయంలో తండ్రి నాగబాబుతో విభేదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు అన్నట్లు కొన్ని కథనాలు రావడం విశేషం. మరి ఈ విషయంలో స్పష్టత రావాలంటే నాగబాబు నోరు విప్పాల్సిందే. ప్రస్తుతం వరుణ్ బాక్సర్ అనే ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో ఆయన ప్రొఫెషనల్ బాక్సర్ గా నటిస్తుండగా కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. సిద్దు ముద్దా, అల్లు వెంకట్ నిర్మాతలుగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ వైజాగ్ వేదికగా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus