జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయం కోసం సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆయన మాత్రం రెండు నెలలుగా నోరు మెదపడం లేదు. రచయితలు, దర్శకులు చెప్పే కథలు వింటూ, కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ గడ్డం, మీసం బాగా పెంచారు. కొంచెం ఒళ్లు కూడా చేశారు. కారణం మాత్రం ఎవరికీ తెలియదు. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూతురు రిసెప్షన్ వేడుకకు తారక్ హాజరయ్యారు.
ఆయన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయారు. మీసాన్ని మెలి తిప్పి, గడ్డాన్ని ట్రిమ్ చేసి చాలా స్టైల్ గా కనిపించారు. ఎన్టీఆర్ కొత్త గెటప్ చూసిన వారందరూ అది కొత్త సినిమా కోసమే అంటున్నారు. రాయల సీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ కథతో మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే నూనూగు మీసాల వయసులో తారక్ చేసిన “ఆది” సినిమా నెలకొల్పిన రికార్డులను ఇప్పుడు మీసం మెలితిప్పి బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడన్న మాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.