బాలయ్య- బోయపాటి సినిమా హక్కులను కొనుగోలు చేసిన దిల్ రాజు..!

టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న దిల్ రాజు… ఓ పక్క చిన్న సినిమాలు మరో పక్క స్టార్ హీరోలతో బడా సినిమాలను రూపొందిస్తూ బిజిగా ఉంటాడు. అంతేకాకుండా వేరే సినిమాల హక్కులను కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటాడు. కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర భాషల సినిమాలను కూడా విడుదల చేస్తుంటాడు దిల్ రాజు.ఇతని ద్వారా సినిమాని విడుదల చేస్తే కచ్చితంగా దానికి మంచి రీచ్ వస్తుందని.. దర్శకనిర్మాతలు భావిస్తుంటారు.

ప్రస్తుతం చరణ్- శంకర్లతో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న దిల్ రాజు మరో పక్క ‘కె.జి.ఎఫ్2’ హక్కులను కూడా కొనుగోలు చేసాడని టాక్ నడుస్తుంది. ఏకంగా ఆ చిత్రాన్ని రూ.72కోట్లకు కొనుగోలు చేసాడని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. దీంతో పాటు బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం నైజాం, ఉత్త‌రాంధ్ర హ‌క్కుల‌ను రూ.16 కోట్లకు కొనుగోలు చేసాడట దిల్‌రాజు. మే 28న విడుద‌ల కాబోతున్న ఈ చిత్రానికి… ‘మోనార్క్’ ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏమైనా దిల్ రాజు మంచి క్రేజ్ ఉన్న రెండు బడా చిత్రాల హక్కులను కొనుగోలు చేసి విడుదల చేస్తుండడంతో.. ఆ చిత్రాల పై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus