టాలీవుడ్ కు మరో బడా నిర్మాత కొడుకు ఎంట్రీ ఫిక్స్..!

ఏంటి.. దిల్ రాజు కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఈ బడా ప్రొడ్యూసర్ కు కొడుకు లేడు కదా కూతురు మాత్రమే ఉంది కదా..? పైన హెడ్డింగ్ చూడగానే ఇలాంటి డౌట్ లే మీ మైండ్లో రన్ అవుతాయని తెలుసు. నిజమే.. దిల్ రాజు కొడుకు లేడు! ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నది అతని తమ్ముడి కొడుకు..! వివరాల్లోకి వెళితే.. దిల్ రాజుతో నిర్మించే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించే శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి.. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట.

ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైపోయిందని ఇన్సైడ్ టాక్. ‘హుషారు’ వంటి డీసెంట్ హిట్ ను తెరకెక్కించిన శ్రీ హర్ష ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి పనిచేసే టీం కూడా పెద్దవాళ్ళే నండోయ్..! ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ప్రభాస్ నటించిన ‘సాహో’ అలాగే ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రాలకు పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ మది ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు.

ఇక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.దీని పై త్వరలోనే క్లారిటీ రానుంది. ఏమైనా దిల్ రాజు పర్యవేక్షణలో ఈ చిత్రం గ్రాండ్ గా రూపొందుతోందని తెలుస్తుంది. ఈ చిత్రం కనుక హిట్ అయితే ఆశిష్ రెడ్డి కూడా హీరోగా నిలదొక్కుకొని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతాడు అనడంలో సందేహమే లేదు..!

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus